ప్రపంచ వ్యాప్తంగా నారింజ పంట దిగుబడి 3.1 కోట్ల టన్నులు ఉంటుంది అన్న విషయం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. నారింజ కాయలో తొక్క బరువే దాదాపు 50శాతం ఉంటుందని నిపుణుల అంచనా. ఈ తొక్క నుండి తీసే నూనెతో అనేక సౌందర్య సాధనాలు తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ తొక్కలను ఎండబెట్టి వ్యవసాయంలో ఉపయోగిస్తే ఎరువుగా కూడ ఉపయోగ పడుతుంది. 

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ నారింజ తొక్కలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక గిన్నెలో ఎండబెట్టిన నారింజ తొక్కల పొడి ఉప్పు వేసి బాగా కలిపి ఆ గిన్నెని ఫ్రిజ్‌లో ఉంచితే ఆ ఫ్రిజ్‌లోని దుర్వాసనలు అన్నీ పోతాయి. ముఖ్యంగా ఈ నారింజ తొక్కలు ఉన్నచోట దోమల్ని, ఈగల్ని దూరం చేస్తుంది. అంతేకాదు  ఒక డబ్బాలో నారింజ తొక్కలు వేసి ఉంచి దానికి రంధ్రాలున్న మూత పెట్టి బట్టలు పెట్టిన అల్మారాలో ఉంచితే బట్టలు మంచి వాసన వస్తాయి. 

అదేవిధంగా ఒక సీసాలో రెండు నారింజ తొక్కలను వేసి అవి మునిగేంత వరకు వెనిగర్ వేయాలి. అలా తయారు అయిన ద్రవాన్ని ఒక సీసాలోకి తీసుకుని ఫర్నీచర్, ఫ్రిజ్, ఓవెన్, స్టెయిన్‌లెస్ స్టీలు వస్తువులను తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి. ఇది చాలదు అన్నట్లుగా నారింజ తొక్కలతో ధర్మాకోల్ కాలుష్యానికి చెక్ పెట్టవచ్చని హైదరాబాద్ లోని ఐఐటి విద్యార్ధులు చేసిన పరిశోధన చైనాలో వారికి బంగారు పతాకాన్ని తెచ్చిపెట్టింది అంటే తోక్కేకదా అని తీసిపారివేసే నారింజ తొక్కలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అర్ధం అవుతుంది. 

ఈ నారింజ తొక్కల నుండి తీసే నూనెతో వాణిజ్య స్థాయిలో అనేక సంచలనాలు కూడ చేయవచ్చని ఈ పరిశోధన తెలియ పరుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో నదులకు సముద్రాలకు ప్రధాన సమస్యగా ఏర్పడుతున్న నూనె తెట్టులను శుభ్రం చేయడానికి వాణిజ్య పరంగా ఈ నారింజ తొక్కల నూనె ఎంతో ఉపయోగ పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడ ఈ నారింజ తొక్కల నూనెలో ఉండటంతో భవిష్యత్ లో ఇలాంటి నూనేలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: