ఎలాంటి వంటకాలు అయినా చింతపండు లేకుండా తయారు చేయడం కుదరదు. రకరకాల వంటలలో చింతపండును పులుపు తీపి ఫ్లేవర్ రావడానికి ఉపయోగిస్తారు. చింతపండులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్లనే చింతపండు హెల్తీ ఇంగ్రిడియంట్ గా మారింది. చింతపండులో హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఫ్యాట్ ఉత్పత్తి తగ్గిస్తుంది. దానితో బరువు తగ్గుతారు. 

చింతపండు గుజ్జులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్ట్సిపేషన్ ని నివారిస్తుంది. అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను కూడా ఎఫెక్టివ్ గా పనిచేయడంలో చింతపండు ఎంతగానో సహకరిస్తుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఇది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. అలాగే హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు అని లేటెస్ట్ పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 

అలాగే క్యాన్సర్ రిస్క్ తగ్గించే మినరల్స్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా మన పొట్టలో, ప్రేగుల్లో చిన్న పుండ్లు ఏర్పడి బాద కలగకుండా ఈ చింతపండు ఉపశమనం కలిగిస్తుంది. దీనికితోడు చింతపండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడమే కాకుండా హార్ట్ రేట్ ని కూడ కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా మన శరీరంలోని ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. 

చింతపండులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రరక్త కణాల ఉత్పత్తి బాగా జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయడంలో ఈ చింతపండు ఎంతగానో సహకరిస్తుంది. దీనివల్ల  కిడ్నీ ఫెయిల్యూర్ మరియు కిడ్నీ క్యాన్సర్ ముప్పు నుండి తగ్గించవచ్చు అన్న విషయాలను కూడ లేటెస్ట్ పరిశోధనలు బయట పెడుతున్నాయి. ముఖ్యంగా అలర్జీటిక్ ఆస్త్మాకు చాలా ఎఫెక్టివ్ గా ఈచింతపండు కాలేయ ఆరోగ్యానికి రక్షణ కలిపించడమే కాకుండా లివర్ సమస్యలతో బాధపడే వారికి ఈచింతపండులోని ఔషదాలు ఎంతగానో ఉపయోగిస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ చింతపండును కేవలం పులుపు కోసం కాకుండా ఆరోగ్య సూత్రాల రీత్యా ప్రతిరోజు మన ఆహార పదార్ధాలలో ఉపయోగించుకోవడం ఎంతో శ్రేయస్కరం..  



మరింత సమాచారం తెలుసుకోండి: