వంటల్లో ఆవ నూనె ఉపయోగించడంఎప్పటినుంచో అలవాటుగా ఉన్న సాంప్రదాయం. ముఖ్యంగా మనం ఎతగానో ఇష్టపడి తినే అవకాయాలలో ఈ ఆవ నూనెను బాగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఆవ నూనె ఉపయోగం వల్ల    జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఈమధ్య జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. ఆవ నూనెను ఎక్కువగా వాడటం వల్ల సామర్థ్యం తగ్గి  జ్ఞాపకశక్తి తగ్గుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.   

ఈ మధ్య కొన్ని దేశాలలో ఎలుకల పై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి అని తెలుస్తోంది. ఈ ఆవ నూనె వల్ల మెదడుకు హాని వాటిల్లడంతోపాటు బరువు పెరగడానికి కూడా ఆవ నూనె కారణం అవుతోందని పరిశోధకుల అభిప్రాయం.  ఆవ నూనెలో యూరిక్ యాసిడ్ తక్కువ మోతాదులో ఉంటుంది. అయితే ఇతర నూనెలతో పోలిస్తే ఖరీదు ఎక్కువగా ఉండే ఈనూనె ఆరోగ్యకరమైందనే భావన  ఉండటంతో  మన తెలుగువారు ఊరగాయలు పెట్టడంలో దీనిని తెగ వాడతారు. 

ఆవ నూనె మెదడులో అమీలాయిడ్ ఫలకాలు ఏర్పడటానికి అల్జీమర్ వ్యాధికి కారణం అవుతోందని పరిశోధకులు తెలియచేస్తున్నారు. ఫలితంగా మెదడులోని న్యూరో వ్యస్త  పనితీరు దెబ్బతిని జ్ఞాపకశక్తి తగ్గుతుందని శాస్త్ర వేత్తల అభిప్రాయం. అయితే ఆవ నూనెతో జ్ఞాపక శక్తి తగ్గుతుండగా ఆలివ్ ఆయిల్‌ తో మాత్రం అందుకు విరుద్ధంగా జ్ఞాపకశక్తి పెరుగుతుందని లేటెస్ట్ పరిశోదనలు తెలియచేస్తున్నాయి.

ఈ మధ్య అమెరికాలోని కొందరు శాస్త్రవేత్తలు మామూలు ఆహారం తీసుకున్న ఎలుకల కంటే ఆవ నూనె తీసుకున్న ఎలుకలు ఎక్కువ బరువు పెరిగగిన విషయాన్ని గుర్తించారు. దీనితో భారతీయులు ముఖ్యంగా దక్షణాది ప్రాంతానికి చెందిన వారందరు ముఖ్యంగా తెలుగువారు తమిళులు వారు ఎంతగానో ప్రేమించే ఆవకాయల విషయంలో ఈ ఆవ నూనె వడక పోవడం అన్ని రకాల మంచిది అన్న సంకేతాలను ఇస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: