మనిషి ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం రాత్రి పూట హాయిగా నిద్రిస్తేనే ఏవ్యక్తి అయినా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. నిద్రలేమి వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలఎత్తడం సహజం.  ఆధునిక కాలంలో పెరిగిపోతున్న ఒత్తిళ్ల కారణంగా చాలామంది నిద్రకు దూరం అవుతున్నారు. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల సరిగా ఆహారం తీసుకోకపోవడం పనిమీద దృష్టి పెట్టకపోవడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. 

కంటినిండా నిద్రపోతే చాలావరకు సమస్యలకుపరిష్కారం దొరకడమే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా మన శరీరానికి వంటబట్టి అనేక ఆరోగ్య సమస్యల నుండి మనలను కాపాడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఈకింద పేర్కొన్న ఆహార పదార్ధాలను తీసుకుంటే మనకు మంచి జరగడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యల నుండి దూరం కావచ్చు. ఈ విషయాలలో ముందుగా పెర్కొనవలసింది  గ్రీన్ టీ, బ్లాక్ టీ, దీనిలో  కొన్ని రకాలైన ఆమ్లాలు ఉండటం వల్ల అవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి నిద్ర పట్టడానికి దోహదం చేస్తాయి. 

ఎల్-థియనైన్ అని పిలిచే రిలాక్సేషన్ అమినో యాసిడ్ యాంగ్జయిటీని తగ్గించి నిద్రపట్టడానికి ఉపకరిస్తుంది. ఇది గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీలలో అధికంగా లభిస్తుంది.ఇలా మంచి నిద్ర పట్టడానికి ఉపకరించే పదార్ధాలలో దాల్చిన చెక్కను కూడ పేర్కొంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా నిద్రపై ప్రభావం చూపుతుంది కాబట్టి దాల్చిన చెక్క రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి నిద్రపట్టడానికి సహకరిస్తుంది. 

ఇక మంచి నిద్రకు సహాయపడే విషయాలలో అల్లంలోని జింజరాల్ ను కూడ పేర్కొనాలి. ఈ రసాయనం కడుపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసి శరీరాన్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా మన ఇది నాడీ వ్యవస్థ ఆరోగ్య వంతంగా ఉండటానికి ఈఅల్లం ఎంతగానో సహకరిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ పదార్ధాలను మనం క్రమం తప్పకుండా పరిమితిలో తీసుకుంటే మనకు నిద్ర పట్టని సమస్యల నుండి మాత్రమే కాకుండా మన శరీర ఆరోగ్యాన్ని కూడ చాల జాగ్రత్తగా  చూసుకోగలుగుతాం..


మరింత సమాచారం తెలుసుకోండి: