రీరానికి శక్తినిచ్చే దుంప జాతి ఆహార పదార్ధాలలో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. దీనిని శాస్త్రీయంగా ‘బేటా వల్గురీస్’ అని కూడ పిలుస్తారు. దీనిలోని బటానినిస్ అనే పదార్ధంతో పేస్టు, జాం, ఐస్‌క్రీంలు తయారుచేస్తారు. కంటికి ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ బీట్ రూట్. అనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పు బీట్‌ రూట్‌ రసం తాగితే త్వరగా ఆ సమస్య నుంచి బయటపడతారు.

ప్రాచీనకాలంలోని గ్రీకులు, రోమన్లు కూడా బీట్ రూట్ ను కూరగాయగా వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. అక్కడ నుంచి ఇంగ్లండ్, ప్రాన్స్, జర్మనీలకు రొమన్ల ద్వారా చేరింది. మనదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా దీనిని సాగుచేస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు బీట్‌రూట్ ను తీసుకుంటే లివర్‌ సంబంధ సమస్యలు తలెత్తవు అని పరిశోధనలు తెలుపుతున్నాయి. అంతేకాదు కొలెస్ట్రాల్‌ ను అదుపులో ఉంచుతుంది ఈ బీట్ రూట్. 

ముఖ్యంగా మలబద్దకాన్నినివారించడంలో ఈ బీట్ రూట్ జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుంది. నైట్రేట్లతోపాటు విటమిన్లు ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ పుష్కలంగా ఈ బీట్ రూట్ జ్యూస్ లో ఉన్నాయి. కాల్షియాన్ని వినియోగించుకోవడానికి తోడ్పడే సైలీషియా సైతం ఇందులో ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌ కు పెద్దపేగుల్లో క్యాన్సర్‌ తో పోరాడే లక్షణం ఉంది.

చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్‌ బి ఎక్కువగా ఉండటంతో దీనిని తీసుకుంటే చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యం బాగుపడుతుంది.  జ్ఞాపకశక్తి కాలేయం పనితీరు మెరుగుపడటానికీ ఎంతగానో సహాయపడే ఈ బీట్ రూట్ జ్యూస్ ను తరుచు తీసుకోవడం మంచిది అని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: