క్యాబేజ్ ని కూరగా లేదంటే సలాడ్ రూపంలో తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే క్యాబేజీ వాటర్ ను ప్రతిరోజు తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. క్యాబేజ్ కూర లేదా సలాడ్ రుచిని కొంతమంది ఇష్టపడరు.

దానితో కనీసం క్యాబేజ్ నీరు తాగడం అలవాటు చేసుకున్నా మంచిది అని అంటున్నారు. క్యాబేజ్ యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను విస్తృతంగా కలిగి ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ డామేజ్ నుండి శరీర కణాలను రక్షించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా క్యాబేజీలో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C, విటమిన్ K వంటి అద్భుతమైన పోషకాలు ఉండటంతో మన శరీర ఆరోగ్య సమస్యలు తొలగించి మనకు ఆరోగ్యం కలిగేలా చేయడంలో ఈ క్యాబేజీ వాటర్ ఎంతగానో సహకరిస్తుంది. 

రోజుకు ఒక గ్లాసు క్యాబేజ్ నీరు తాగితే ప్రమాదకర రోగానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్ ని అయినా అడ్డుకుంటుంది. క్యాబేజ్ లో ఉండే బీటా-కెరోటిన్ మన కంటి చూపును ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ క్యాబేజ్ నీరు తాగడం వల్ల ఇది కంటిచూపు మందగించకుండా అడ్డుపడి మన కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అంతేకాదు ప్రతిరోజూ క్యాబేజ్ నీరు తాగితే చర్మానికి చాలా మంచిదని చెపుతున్నారు. 

ఇందులో ఉండే అద్భుతమైన ఫైటో కెమికల్స్, యాంటీ-ఆక్సిడెంట్ల వల్ల ఎక్కువగా చర్మ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా క్యాబేజ్ లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అద్భుతమైన పోషకాలు అధికంగా ఉంటంతో మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటానికి సహాయ పడతాయి. దీనికితోడు క్యాబేజీ వాటర్ లో ఉండే ఫైటో న్యూట్రియ౦ట్స్ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటుంది. అదేవిధంగా అధిక రక్తపోటు వంటి రక్త సంబంధిత ప్రమాదకర ఆరోగ్య సమస్యల నివారణకు సహాయపడుతుంది ఈ క్యాబేజీ వాటర్. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న ఈ క్యాబేజీ వాటర్ ను ప్రతిరోజు తీసుకుంటే మన ఆరోగ్యం ఎంతో మెరుగవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: