జయసుధ, ప్రకాష్ రాజ్ మరియు రామ్ చరణ్ నటన,సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ,క్లైమాక్స్ సన్నివేశాలు,దర్శకత్వం,యువన్ అందించిన నేపధ్య సంగీతం.జయసుధ, ప్రకాష్ రాజ్ మరియు రామ్ చరణ్ నటన,సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ,క్లైమాక్స్ సన్నివేశాలు,దర్శకత్వం,యువన్ అందించిన నేపధ్య సంగీతం.ఇప్పటికే చాలాసార్లు చూసిన కథ,మొదటి అర్ధ భాగం కాస్త నెమ్మదిగా సాగడం,ఎడిటింగ్,ఊహించదగ్గ కథనం,ఫైట్స్.

లండన్ లో పుట్టి పెరిగినా తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చే కుర్రాడు అభిరామ్(రామ్ చరణ్). మన పని మనమే చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మన కుటుంబాల్ని మనమే కలుపుకుపోవాలి అనేది అభిరామ్ మనస్తత్వం. కొన్ని కారణాల వల్ల అభిరామ్ కి తన తండ్రి చంద్రశేఖర్ రావు(రెహమాన్) గతం తెలుస్తుంది.

ఎలాగైనా తన తండ్రిని తన కుటుంబంతో కలపాలని తన కుటుంబాన్ని వెతుక్కుంటూ అభిరామ్ ఇండియాకి వస్తాడు. అలా వచ్చిన అభిరామ్, బాలరాజు(ప్రకాష్ రాజ్) ఇంట్లో చోటు సంపాదిస్తాడు. అక్కడి నుంచి తన తండ్రిని తన కుటుంబంతో కలపడానికి ఏం చేసాడు.? దానికోసం ఎలాంటి సమస్యలని ఎదుర్కున్నాడు. తను ఆ ఇంటి వారసుడు అని చెప్పకుండానే ఎలా బాలరాజు కుటుంబంలో కలిసిపోయాడు? తన తండ్రి గతం ఏమిటి.? నిజం తెలిసాక బాలరాజు ఎలా స్పందించాడు? అనే ఆసక్తికర విషయాలను వెండితెరపైనే చూడాలి..

చరణ్ తేజ మొదటి సారి పలు కోణాలున్న పాత్రలో కనిపించారు దానికి తగ్గట్టుగానే అతని నటనలో కూడా చాలా మార్పులు చేసుకున్నారు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల వద్ద అతని నటన సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది ఎటువంటి సందేహం లేకుండా ఇది చరణ్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పుకోవచ్చు. కాని, ఈ పాత్రకు ఇది సరిపోలేదు అన్న భావన కొన్ని సన్నివేశాల వద్ద కలిగింది.. జయసుధ పాత్ర మొదట్లో మాములుగానే ఉన్నా క్లైమాక్స్ వద్ద వచ్చే సన్నివేశంలో జయసుధ గారు తన అనుభవాన్ని రంగరించి ఆ సన్నివేశాన్ని ఒక అద్భుతం గా మలిచారు..

ఈ చిత్రానికి ప్రధాన హైలెట్స్ లో జయసుధ గారు ఒకరు అనే కాకుండా హైలెట్స్ మొదటగా ఈ నటి పేరే చెప్పుకోవాలి.. ప్రకాష్ రాజ్ పాత్ర అతనికి రొటీన్ అయిపోయిన పాత్రనే కాని ఈ చిత్రంలో ఆ పాత్ర బాగా ఒదిగిపోయింది కాబట్టి చాలా బాగుంది.. ఈ నటుడు కూడా చివర్లో వచ్చే సన్నివేశాల వద్ద తన అనుభవాన్నంతా కలిపి సన్నివేశాన్ని రక్తి కట్టించారు.. బంగారి పాత్రలో శ్రీకాంత్ ఆకట్టుకున్నారు , కాని పాత్రకి ప్రాముఖ్యత లేకపోవడంతో మిగిలిన పాత్రలతో పాటు కలిసిపోయింది.. కాజల్ పేరుకి కథానాయిక పాత్రనే కాని ప్రాముఖ్యత పెద్దగ లేని పాత్ర, తన అందాలతో మరియు కొన్ని కొంటె సన్నివేశాలతో చాలా ఆకట్టుకుంది ముఖ్యంగా పాటల్లో ప్రేక్షకులను కట్టిపడేసింది... కోట శ్రీనివాస్ లాంటి అనుభవం గల నటుడికి ఇది తగిన పాత్ర కాదేమో అనిపించింది అదే సమయంలో రావు రమేష్ మరియు పోసాని కృష్ణ మురళి ల పాత్రలు కూడా ఆకట్టుకోలేకపోయింది.. కమిలిని ముఖర్జీ కొన్ని సన్నివేశాలలోనే కనపడినా ఆకట్టుకుంది.. ఆదర్శ్ నటనాపరంగా అన్ని సన్నివేశాలకు ఒకే రకమయిన హావభావాలు ఇచ్చారు, ఈ నటుడి పాత్ర ఆ స్థాయి వరకే ఉంది.. రెహమాన్ కనిపించే అతి తక్కువ సన్నివేశాలలో కూడా చాలా ఆకట్టుకున్నారు.. పరుచూరి వెంకటేశ్వర రావు , వెన్నెల కిషోర్, భానుశ్రీ మెహ్ర మరియు హర్ష వర్ధన్ అల కనిపించి వెళ్ళిపోయారు...

ఈ చిత్ర కథ చాలా చిత్రాలను పోలి ఉంటుంది, చివరగా ఇటువంటి కథనే మనం "అత్తారింటికి దారేది" లో కూడా గమనించవచ్చు. కాని ఇలాంటి కథను హేండిల్ చెయ్యడం కనిపించినంత సులభం కాదు ఇలాంటి విషయంలో కీలక పాత్ర పోషించేది కథనం ఆ విషయంలో ఈ చిత్రాన్ని చాలా మెచ్చుకోవాలి కృష్ణ వంశీ రాసుకున్న కథనంలో మొదటి సన్నివేశం దగ్గరే కథ మొదలెట్టేసినా కూడా చివరి వరకు ఎక్కడా సాగదీసినట్టు అనిపించదు అందులోనూ తెలుగు కుటుంబం తెలుగు సంప్రదాయాలను కథనంలో కలిపినా విధానం అద్భుతం అని చెప్పుకోవాలి.. అంతే కాకుండా నటులు కాకుండా పాత్రలు కనిపించేలా రాసుకున్నారు.

గత కొన్ని చిత్రాలుగా కాస్త ఇబ్బంది పడుతున్న కృష్ణ వంశీ ఈ చిత్రంతో పూర్తిగా తన బలాన్ని తిరిగి దక్కించుకున్నాడు అని చెప్పుకోవాలి.. కథనం కూడా ఆయనే రాసుకోవడంతో పూర్తి స్వేచ్చ దక్కినట్టు అయ్యింది .. ఇక పాటల విషయంలో కూడా కృష్ణ వంశీ శైలి పూర్తిగా కనిపిస్తుంది. కోరియోగ్రఫీ అంత గొప్పగా లేకపోయినా తెర మీద అన్ని పాటలు చాలా అందంగా కనిపించాయి.. సినిమాటోగ్రఫీ అందించిన సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ముఖ్యంగా పాటల్లో సినిమాటోగ్రఫీ ని టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు.. నవిన్ నూలి అందించిన ఎడిటింగ్ పరవాలేదు కొన్ని సన్నివేశాలలో అనవసరమయిన ఫేడ్ లు వెయ్యడం కొన్ని సన్నివేశాలలో అకస్మాతుగా కట్ చెయ్యడం వల్ల సన్నివేశంలో నాణ్యత దెబ్బ తిన్నాయి.. మాటలు ఇచ్చిన పరుచూరి సోదరులు సన్నివేశానికి బలం చేకూర్చే మాటలు అందించారు. యువన్ శంకర్ రాజ అందించిన సంగీతం వినడానికే కాకుండా చూడటానికి కూడా బాగుండటంతో అన్ని పాటలు ఆకట్టుకున్నాయి.. నేపధ్య సంగీతం కూడా అన్నివేశానికి తగ్గట్టుగా ఉంది.. పరమేశ్వర ఆర్ట్స్ నిర్మాణ విలువలు అద్భుతం అని చెప్పుకోవాలి..

సినిమాలో సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే చాలు హిట్ అయిపోతుంది చిత్రం మొత్తం ఎలా ఉన్న చివరి పది నిమిషాలు కీలకం.. ఇవి ఒక ప్రముఖ దర్శకుడు ఒక సందర్భంలో అన్న మాటలు ఈ పదాలకు సరయిన అర్ధం చెప్పే చిత్రాలు చాలా తక్కువగా వస్తుంటాయి చివరిగా ఇలాంటి చిత్రం మనం అత్తారింటికి దారేది చూసాము ఆ తరువాత సరిగ్గా ఇదే సూత్రానికి సరిపోయే చిత్రం "గోవిందుడు అందరి వాడెలే " .. చివర్లో ఎలాగు కలిసిపోతారు అని తెలిసాక కూడా చిత్రాన్ని ఆసక్తికరంగా నడిపించడం అంత సులువయిన విషయం కాదు ఆ విషయంలో ఈ రెండు చిత్రాలు సఫలం అయ్యాయి.. ఇది ఒక హీరోకి మాత్రమే పరిమితం అయ్యే చిత్రం అయితే కాదు.. నిజానికి కృష్ణ వంశీ ఇంతటి బలమయిన సన్నివేశాలను రచించి చాలా రోజులు అయ్యింది, మొగుడు మరియు పైసా వంటి చిత్రాలలో ఇటువంటి సన్నివేశాలు కనబడవు.. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ వద్ద మనం అనుకున్నదే జరుగుతున్నా కూడా ఆ సన్నివేశంలో జయసుధ నటన మరియు కృష్ణ వంశీ టేకింగ్ చిత్రాన్ని నిలబెట్టాయి అనడంలో ఆశ్చర్యం లేదు. స్టార్ హీరో గా ఇమేజ్ వచ్చాక కూడా అన్ని పాత్రల ప్రాముఖ్యతను చూపించే ఇటువంటి చిత్రాన్ని చేసిన రామ్ చరణ్ ని మెచ్చుకొని తీరాలి..

మొదటి అర్ధ భాగం పరవలేధనిపించినా రెండవ అర్ధ భాగం చాలా బాగా హేండిల్ చేసి క్లైమాక్స్ చేరే వద్దకి తారాస్థాయికి తీసుకెళ్ళారు.. కాని ఇప్పటికే చూసిన పలు చిత్రాలను పోలిన కథ కన్నా కాస్త నూతన కథ ఏదయినా ప్రయత్నించి ఉంటె బాగుండేది అనిపించింది.. కమర్షియల్ అంశాల కోసం ప్రయత్నంలో తన ఉనికిని కోల్పోతున్నారేమో ఒక్కసారి గమనించవలసిన అవసరం ఎంతయినా ఉంది.. కాని ప్రస్తుతం పరిశ్రమ అవలంబిస్తున్న ఆనవాయితికి ఈ చిత్రం సరిగ్గా సరిపోతుంది .. రామ్ చరణ్ కి ఇది ఒక కొత్తరకమయిన చిత్రం కావడంతో పాటుగా అతని నటన, డాన్స్ కూడా ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యాయి.. ఈ చిత్రంలో నాకు నచ్చిన మరొక అంశం టైటిల్స్ మొత్తం తెలుగులోనే వెయ్యడం. పలుమార్లు తెలుగు భాష ప్రాముఖ్యతను చెప్పడానికి ప్రయత్నించడం.. "గోవిందుడు అందరి వాడెలే" చిత్రం తెలుగు సంప్రదాయాల గురించి చెప్పే చిత్రం కుటుంబ విలువలు నేర్పే చిత్రం మనుషుల వ్యక్తిత్వాల గురించి చూపే చిత్రం .. ఈ దసరాకి ఈ చిత్రం థియేటర్ లో ఒక చిన్న పండుగ అని చెప్పుకోవచ్చు.. పండుగ సమయంలో కుటుంబంతో చిత్రం చూడాలి అనుకుంటే వెంటనే టికెట్స్ బుక్ చేసేసుకోండి...



10:15 am : ఊరు అంటేనే కుటుంబం అనుకున్నాను. కానీ కుటుంబాలు కలిసి ఉంటేనే ఊరు బాగుంటుంది అని నిరూపించాడు నా ఫారిన్ మనవడు : ప్రకాశ్ రాజ్ డైలాగ్ .. సినిమా సమాప్తం. వెంటనే రివ్యూ అందిస్తాం చూస్తూనే ఉండండి ఏపీహెరాల్డ్.కామ్.

9:55 am : వర్షం సినిమా స్టయిల్ మాదిరిగా ఉంది ఛేజింగ్ ఫైటింగ్ సీన్ కానీ సూపర్ గా ఉంది. అభిరామ్ కు తీవ్రంగా గాయాలు అవుతాయి.

9:45 am : అభిరామ్ (రామ్ చరణ్) ఆ ఊరు వదిలి వెళ్లి పోతాడు. తర్వాత జయసుధ, ప్రకాశ్ రాజ్ తమ నటన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. దాదాపు కన్నీరు పెట్టించారు. సినిమా క్లయిమాక్స్ కు చేరుకుంది.

9:40 am : బాలరాజ్(ప్రకాశ్ రాజ్) సత్య ( కాజల్) కి పెళ్లి చూపులు ఎరేంజ్ చేస్తాడు. అభి గురించి కొన్ని నిజాలు తెలుసుకొని సత్య అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

9:32 am : ‘బంగారు బావ’ పాట చాలా గ్రేట్ గా చిత్రీకరించారు. అచ్చమైన పల్లెటూరి వాతావరణం బావా మరదళ్ల అల్లరి ఈ పాట కొరియోగ్రఫి చాలా బాగుంది. మ్యూజిక్ ఇరగదీశాడు.

9:28 am : పోసాని కృష్ణ మురళి, కోటా మధ్య జరిగే సన్నివేశాలు థియేటర్లో ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.

9:25 am : అభిరాం పై బంగారం కక్ష సాధించుకోవాలని చూస్తాడు. హాస్పిటల్ కు చెందిన ఎక్విప్ మెంట్స్ విషయంలో గందరగోళం చేస్తాడు. నిజాన్ని అభిరామ్ తెలుసుకుంటాడు.

9:15 am : అభిరామ్ బంగారం కోసం ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతాడు. చిత్ర (కమిలిని ముఖర్జీ ) పెళ్లి చేయాలని చూస్తారు. సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లింది.

9:12 am : ‘రా రా రాకుమారా’ పాట చిత్రీకరణ, సంగీతం చాలా బాగుంది. కాజల్, చరణ్ ల కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరినట్లు అనిపిస్తుంది. పాటను థియేటర్లో వాళ్లు ఎంజాయ్ చేశారు.

9:10 am : అభిరామ్ ప్రామిస్ చేస్తాడు. ఆ ఊళ్లో హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని. కానీ సత్యకు అభిరామ్ గురించి తెలిసిపోతుంది.

8:20 am : థియేటర్లో సెకండ్ ఆఫ్ ప్రింట్ రావడం లేట్ కారణంగా ట్విట్స్ కొంచెంగ గ్యాప్ వస్తుంది క్షమించండి

............................ విశ్రాంతి............................

7:30 am : బంగార్రాజు చిత్ర (కమిలిని ముఖర్జీ) వెంట పడుతుంటాడు. ఈ విషయంలో అభిరామ్ ఎంటర్ అవుతాడు.

7:20 am : ‘గులాబీ కనులు’ పాట సూపర్ గా ఉంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది.

7:15 am : ఆదర్శ విలన్ రోల్.. అభిరామ్ పై కక్ష తీర్చుకోవాలని ప్లాన్ వేస్తాడు. ఈ సీన్ అంత పర్ఫెక్ట్ గా లేదు.

6:55 am : అభిరామ్ తన తాత కుటుంబంలో ఉన్న వారందరి గురించి తెలుసుకుంటాడు. ‘నీలి రంగూ చీరలోనా ’ పాట చాలా బాగుంది. మంచి కుటుంబ నేపథ్యంలో మనసుకు హత్తుకునేల పాట ఉంది.

6:48 am : బంగార్రాజు (శ్రీకాంత్) కొట్టే పంచ్ డైలాగ్స్ కి థియేటర్లో నవ్వులే నవ్వులు.. బంగార్రాజు కి బాలరాజు (ప్రకాశ్ రాజ్)కి జరిగే సన్నివేశాలు చాలా బాగున్నాయి.

6:42 am : చిన్నగా బాలరాజు (ప్రకాశ్ రాజ్) తో క్లోజ్ అవుతాడు అభిరామ్.. జయసుధ ఇంట్రడ్యూసింగ్ చాలా బాగుంది.

6:38 am : ఓటరు లీస్టులో మన పేరు ఉండటం కాదు... చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉండాలి : ప్రకాశ్ రాజ్ డైలాగ్

6:35 am : బంగార్రాజు ( శ్రీకాంత్) కోడిపందాల్లో బెట్టింగ్ చేస్తూ ఇంట్రడ్యూస్ అవ్వడం మంచి పల్లెటూరి వాతావరంలా కనిపించింది. బాలరాజు (ప్రకాశ్ రాజ్) ఇప్పడే ఇంట్రడ్యూస్ అయ్యాడు.

6:33 am : అనుకోకుండా కాజల్ ను కలుస్తాడు అభిమామ్ అప్పతే తనను బాగా ఇష్టపడుతాడు

6:30 am : తన తండ్రిని తన తాత కుటుంబంలో ఉన్న కలతలను తీర్చి ఇద్దరినీ కలపడానికి లండన్ నుంచి బయలు దేరుతాడు అభిరామ్ (రామ్ చరణ్)

6:23 am : చివరి మూవ్ మెంట్ లో లండన్ ప్రొఫెసర్ ఫిలిప్ క్వీన్ మేరీ యూనివర్సిటీకి డీన్ అవుతాడు. అప్పడు చంద్రశేఖర్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడుతాడు

6:20 am : ‘ ప్రతి చోట నాకు స్వాగతం’ పాట చాలా చాలా బాగుంది. కొరియోగ్రఫీ సూపర్, పిక్చరైజేషన్, లోకేషన్స్ చాలా బాగున్నాయి.

6:20 am : ‘ ప్రతి చోట నాకు స్వాగతం’ పాట చాలా చాలా బాగుంది. కొరియోగ్రఫీ సూపర్, పిక్చరైజేషన్, లోకేషన్స్ చాలా బాగున్నాయి.

6:13 am : చంద్రశేఖర్ రావు (రహమాన్) డీన్ గా కాలేజీలో ఎన్నకోబడుతాడు. అభిరామ్ (చరణ్) రబ్బీ గేమ్ ఆడుతూ ఇంట్రడ్యూస్ అయ్యాడు.

6:08 am : మన పని మనమే చేసుకోవాలి, మన ఇళ్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి

6:05 am : సినిమా UA సర్టిఫికెట్..159 నిడివి

6:00 am : హాయ్! గుడ్ మార్నింగ్ ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్స్ కృష్ణ వంశి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించగా ప్రకాశ్ రాజ్,శ్రీకాంత్,జయసుధ,కమిలిని ముఖర్జి నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్వాగతం

Ram Charan,Kajal Aggarwal,Krishna Vamsi,Bandla Ganesh,Yuvan Shankar Raja.గోవిందుడు అందరి వాడెలే - ఇది అందరికి నచ్చే చిత్రమేలే ....

మరింత సమాచారం తెలుసుకోండి: