టాప్ హీరోలు తాము నటిస్తున్న సినిమాల గురించి ఏమాత్రం నెగిటివ్ వార్తలు మీడియాలో వచ్చినా చాల ఖంగారు పడిపోతారు. కానీ రామ్ చరణ్ కు తన సినిమాల పై ఎంత నెగిటివ్ ప్రచారం జరిగితే ఆ సినిమా అంత సూపర్ హిట్ అవుతుందని ఒక విచిత్రమైన నమ్మకం అని అంటున్నారు. గతంలో ‘మగధీర’ సినిమాకి బడ్జెట్‌ ఎక్కువైపోయింది ఆ సినిమా నిర్మాణం ఆలస్యమయ్యింది అనే నెగిటివ్ వార్తలు వచ్చినా ‘మగధీర’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అదేవిధంగా చరణ్ సినిమాలలో హిట్స్ గా చెప్పుకునే ‘రచ్చ’, ‘నాయక్’ సినిమాల విషయంలో కూడ నెగిటివ్ వార్తలు వచ్చినా ఆ సినిమాలు కూడా మంచి విజయాలను సాధించి చరణ్ నెగిటివ్ సెంటిమెంట్ ను మరింత పెంచాయి.  ఇక ‘ఎవడు’ విషయంలో అన్నీ అనుమానాలే ఆ సినిమా అసలు విడుదల అవుతుందా అన్న విషయం దగ్గర నుంచి సక్సస్ కాదేమో అనే విషయం వరకూ ఎన్నో అనుమానాలు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఏకంగా ఈ సినిమా మహేష్ బాబు కే షాక్ ఇచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చరణ్ తన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా పై ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తున్నా పట్టించుకోకుండా ఆ వార్తలను చరణ్ ఎంజాయ్ చేస్తున్నాడు అని టాక్. అంతేకాకుండా ఈ సినిమా పై ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తే తనకు అంత మంచిదని తన సన్నిహితులతో చరణ్ ధీమాగా అంటున్నాడట. రకరకాల సెంటిమెంట్లను చూసిన ఫిలింనగర్ జనం ఇదేమి కొత్త సెంటిమెంట్ అంటూ చరణ్ పై కామెంట్స్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: