గత కాలంలో సినిమా పూర్తి అయిన తరువాత ఆ సినిమాను సినిమా పరిశ్రమలోని పెద్దలకు చూపెట్టి వారి అభిప్రాయాలను తీసుకునేవారు. అయితే ప్రస్తుత లేటెస్ట్ ట్రెండ్ లో సినిమా గురించి న్యూస్ బయటకు వస్తే బయ్యర్లు ఎక్కడ పారిపోతారో అన్న భయంతో ఇప్పటి నిర్మాతలు తమ సినిమా విషయాలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.  ‘మనం’ సినిమాతో టాలీవుడ్ మరిచిపోయిన ఒక పాత విధానానికి తిరిగి తెర తీసాడు నాగార్జున. ఇప్పుడు దగ్గుబాటి వారు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. వెంకీ నటించిన ‘దృశ్యం’ సినిమాను విడుదల కాకముందే మీడియాకు, సినిమా పెద్దలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం భారీగా హడావుడి కూడా చేసారు.  ఇదిలా వుంటే ‘దృశ్యo’ ప్రీమియర్ షోను చూసిన వారు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇది కూడ ‘మనం’ లాగే సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను చూసిన వారి అభిప్రాయంలో ‘దృశ్యం’ సినిమాలోని సెకండ్ ఆఫ్ సస్పెన్స్ ఎలిమెంట్, వెంకటేష్ నటనతో పాటు సహా నటీనటుల నటన కూడ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారిందని అంటున్నారు. అయితే సినిమా మొదలు అయిన 20 నిముషాలు డల్ గా నడవడంతో పాటు కేవలం మలయాళ సినిమా ‘దృశ్యo’ కు కాపీ అండ్ పేస్ట్ గా ఈ సినిమా మారి పోవడంతో తెలుగు నేటివిటీ ఈ సినిమాలో తక్కువగా కనిపించింది అనే టాక్ కూడ వినిపించింది.  ఈ సినిమా సిటీ ప్రేక్షకులకు బాగా నచ్చినా బి,సి సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమాకు ఎటువంటి ఓటు వేస్తారు అన్న విషయం పై ఈ సినిమా విజయం ఆధార పది ఉంటుంది అన్న టాక్ ఈ ప్రీమియర్ షోలో వినిపించింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: