క్రియేటివ్ దర్శకుడిగా పేరుగాంచిన రవిబాబు లేటెస్ట్ గా అల్లరి నరేష్ పై చేసిన ‘లడ్డూబాబు’ ఘోర పరాజయం చెందడంతో నరేష్ షాక్ అయినా రవిబాబు మాత్రం తన ప్రయోగాలను కొనసాగిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ దర్శకుడి దృష్టి రానా పై నిలిచింది. దగ్గుబాటి యువ హీరో రానా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఒక్క హిట్ తన ఖాతాలో వేసుకోలేక పోయాడు. ఎన్ని సినిమాలు చేసినా తాను ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి', గుణశేఖర్ దర్శకత్వంలో ‘రుద్రమదేవి' చిత్రాల్లో నటిస్తున్న రానా రవిబాబు తెరకెక్కించబోయే సినిమాకు రానా కమిట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కమర్షియల్ చిత్రాల పోకడలో కాకుండా ప్రయోగాత్మకంగా సరికొత్త స్క్రిప్టుతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట రవిబాబు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని రానా సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించబోతున్నట్లు టాక్.  అయితే రవిబాబు దర్శకత్వంలో రానా చేయడంపై భిన్నవాదనలు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రాలతో రవిబాబు మంచి పేరు ఉన్నా రానా ఇమేజ్‌కు తగిన దర్శకుడు రవిబాబు కాదని అంటున్నారు. ఇప్పటికే వరుస ప్లాపుల ఉన్న రానా అనవసరంగా రిస్క్ చేస్తున్నాడనే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.  ఈ వార్తలు ఇలా ఉండగా రవిబాబు గత సంవత్సరం పూర్ణ ప్రధానపాత్రతో తాను తీసిన ‘అవును' చిత్రానికి సీక్వెల్ రెడీ చేస్తున్నాడు అనే వార్తలు కూడ వస్తున్నాయి. రానా రవిబాబుతో చేస్తున్న ప్రయోగం ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: