నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో పెడితే బన్నీ డాన్స్ లు కొందరి హీరోలకు పాఠ్యాంశాలుగా మారుతున్నాయి. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ విషయాలను స్వయంగా దర్శకుడు వినాయక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసి సంచలనం సృస్టించాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనువాసును హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయమని బెల్లంకొండ వినాయక్ ను అడిగినప్పుడు వినాయక్ షాక్ అయ్యాడట. దీనికి కారణం వినాయక్ కెరియర్ లో ఎప్పుడు కొత్త హీరోలతో సినిమాలు తీయలేదు. దీనితో తన కెరియర్ కు బ్రేక్ ఇచ్చిన బెల్లంకొండకు ఏమి చెప్పాలో తెలియక బెల్లంకొండ తనయుడు శ్రీనివాస్ కు కొన్ని పరీక్షలు పెట్టి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాడట. అప్పటికే శ్రీనివాస్ యాక్టింగ్, డాన్స్ ల విషయంలో శిక్షణ తీసుకున్నా ఆ విషయాన్ని వినాయక్ పరిగణలోకి తీసుకోలేదట. ఆ తరువాత వినాయక్ దగ్గరకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ కు అల్లుఅర్జున్ నటించిన సినిమాలలోని కొన్ని హాస్య సన్నివేశాలు అదేవిధంగా ఆ సినిమాలలోని బన్నీ డాన్స్ లను చూపెట్టి బన్నీని ఉదాహరణగా తీసుకుని ఎనర్జిటిక్ గా డాన్స్ చేయమని చెప్పడమే కాకుండా రెండురోజులు ఏకధాటిగా శ్రీనివాస్ పై వినాయక్ ట్రయిల్ షూట్ తీసాడట. ఆ ట్రయిల్ షూట్ నచ్చిన తరువాత మాత్రమే ‘అల్లుడు శ్రీను’ సినిమాను తీసానని వినాయక్ చెపుతున్నాడు. వినాయక్ చెప్పిన మాటలను బట్టి బన్నీ డాన్స్ లు కొత్త హీరోలకు పాఠ్యాంశాలుగా మారిపోతున్నాయి అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: