పవన్ ‘గోపాలా గోపాలా’ సినిమాలో పవర్ స్టార్ లుక్ ఎలా ఉండబోతుంది అన్న ఆత్రుత నెలకొన్న వేళ పవన్ గోపాలుడి గెటప్ గురించి ఒక ఆశక్తికర రూమర్ ఫిలింనగర్ లో ప్రచారంలో ఉంది. పవన్ తాను నటించే ప్రతి సినిమాలోను తన లుక్ ను చాల స్టైల్ గా మల్చుకుంటాడు. అయితే పవన్ నటించిన పంజా సినిమాలో మాత్రం భారీగా గడ్డం పెంచి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా పవన్ లుక్ రీత్యా ఒక డిఫరెంట్ సినిమాగా మిగిలింది. ప్రస్తుతం ‘గోపాలా గోపాలా’ సినిమాలో కలియుగ కృష్ణుడిగా కనిపించబోతున్న పవన్ లుక్ బాగా పెంచిన గెడ్డంతో ఉంటుంది అని టాక్. అయితే ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళ పాత్రలకు గెడ్డంతో చుసిన సoదర్భాలు లేకపోయినా ఇది కలియుగ కృష్ణావతారం కాబట్టి ఇలా కనిపించబోతున్నాడు అని అనుకోవాలి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా పవన్ లుక్ గురించి వార్త వెబ్ మీడియాలో కనిపిస్తూ ఉండటంతో పవన్ అభిమానులలో మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యాయి.  ఈ నెల మూడవ వారం నుండి పవన్ కళ్యాణ్ వెంకటేష్ ల మధ్య ఈ సినిమాకు సంబంధించిన సన్నివేసాల చిత్రీకరణ మొదలు అవుతుంది అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: