పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గోపాల గోపాల. ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయాన్ని చిత్రయూనిట్ చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ తన డేట్స్ ని ఇచ్చి, షూటింగ్ ని త్వరగా ఫినిష్ చేయమని చెబితే, అందుకు చిత్ర యూనిట్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది, టైం తీసుకోండి సార్ అంటూ పవన్ కి సంబంధించిన షూటింగ్ ని డిలే చేసుకుంటూ వస్తుంది. దీంతో ఈ మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన న్యూస్ ప్రతి రోజు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ మూవీలో ఎప్పుడు నటిస్తాడు? తను ఏ గెటప్ లో కనిపించనున్నాడు? వంటి ప్రశ్నలు పవన్ అభిమానుల్లో నిరంతరం కదులుతున్న ప్రశ్నలు. ఇదే గోపాల గోపాల మూవీ పై హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గెడ్డంతో కనిపంచనున్నాడు. మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ గెటప్స్ కి సంబంధించిన ట్రయల్ షూట్స్ ని చిత్ర యూనిట్ నిర్వహించింది. అందులో పవన్ కళ్యాణ్ ని క్లీన్ లుక్ లో చూపించాలని అనుకున్నారు. కాని గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ గెడ్డంతో కనిపిస్తూ, సూపర్భ్ గా ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాన్ ని గడ్డంతో చూపించటానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో పంజా మూవీలో గెడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ‘గోపాల గోపాల’ సినిమా కోసం పవన్ మరోసారి గెడ్డంతో కనిపిస్తున్నాడు. పవన్ లుక్స్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని త్వరలోనే చిత్రయూనిట్ బయటకు రిలీజ్ చేయనుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: