198o ప్రాంతాలలో గ్లామర్ హీరోయిన్ గా అలనాటి దక్షిణాది టాప్ హీరోలు అందరితోను నటించి దాదాపు 100 సినిమాలలో ఆ రోజులలోనే హీరోయిన్ గా నటించిన రికార్డు శ్రీప్రియది. ఒక మహిళా దర్శకురాలిగా ‘దృశ్యం’ సినిమా ద్వారా విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీప్రియ మీడియాతో ‘దృశ్యం’ తెర వెనుక కధలను షేర్ చేసుకుంది.  ఈ సినిమాను ఆమె తెలుగులో రీమేక్ చేయడానికి ఆలోచిస్తున్న రోజులలో కమలహాసన్ శ్రీప్రియకు ఈ సినిమా రీమేక్ విషయాన్ని వెంకటేష్ వద్ద ప్రస్తావిస్తే పని జరుగుతుంది అని సలహా ఇవ్వడంతో జయసుధ ద్వారా ఈ సినిమా రీమేక్ విషయాన్ని వెంకటేష్ వద్ద ప్రస్తావించి అతడి అంగీకారాన్ని పొందాను అని చెప్పింది. అయితే వెంకటేష్ లాంటి టాప్ హీరో ఒక మహిళా దర్శకురాలి దర్శకత్వంలో నటిస్తున్నప్పుడు వెంకటేష్‌ కు ఉన్న స్థాయి రీత్యా ఏమైనా సమస్యలు పెడతాడేమో అని భయపడిందట శ్రీప్రియ. అయితే వెంకీ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడంతో తనకు ఎటువంటి సమస్యలు లేకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగాలిగానని శ్రీప్రియ చెపుతోంది. అరకులోయ సౌందర్యాన్ని ఆ ప్రాంతపు వేషభాషలను ‘దృశ్యం’ తెలుగు రీమేక్ లో పెట్టడంతో ప్రేక్షకులకు ఎక్కడా మరో పరభాషా సినిమా కధను చూస్తున్నామనే భావన లేకుండా జరిగిందని అంటూ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలలో రాణించడం వల్ల ఈ సినిమా సక్సస్ అయింది అంటోంది శ్రీప్రియ. విజయనిర్మల తరువాత తెలుగులో ఒక టాప్ హీరో సినిమాను డైరెక్ట్ చేసిన రికార్డు అందుకోవడమే కాకుండా విజయాన్ని కూడ సాధించింది శ్రీప్రియ.  

మరింత సమాచారం తెలుసుకోండి: