టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల క్యారక్టరైజేషన్ ఎంత ముఖ్యమో, అంత కంటే హీరోని ఎలివేట్ చేసే రోల్స్ కూడ అంతే ముఖ్యం. అందుకనే హీరోలు తెలివిగా వారి మూవీల్లో గ్రేట్స్ స్టార్స్ ని తీసుకుంటారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జగపతి బాబు నెగిటివ్ రోల్స్ కి ప్రాధాన్యత పెరుగుతుంది. అంతే కాకుండా జగపతి బాబుకి ఏదేనా ఇంపార్టెంట్ రోల్ ని ఇవ్వటానికైనా చిత్ర దర్శకులు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గోవిందుడు అందరి వాడేలే మూవీలో చరణ్ సరసన జగపతి బాబు నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. చరణ్ కి తండ్రి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నట్టుగా వచ్చిన వార్తలు నిజమే అంటూ చిత్ర యూనిట్ సైతం ఒకానొక దశలో మేటర్ ని లీక్ చేసుకుంటూ వచ్చింది. అయితే చివరి నిముషంలో చరణ్ కి తండ్రి పాత్రలో జగపతిబాబుకి బదులు తమిళ నటుడు రెహమాన్ తెరపైకి వచ్చాడు. గతంలో ఈ పాత్ర కోసం జగపతి బాబుని సంప్రదించినా, చివరకు ఈ అవకాశం రేహమాన్ ను వరించిందట. కుటుంబ అనుబందాలు, ఆప్యాతల నేపధ్యంలో తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్ తాతయ్యగా ప్రకాష్ రాజ్, బాబాయిగా శ్రీకాంత్ నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. జయసుధ, కమలినీ ముఖర్జీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా టీజర్ జూలై 28న, దర్శకుడు కృష్ణవంశి పుట్టినరోజున విడుదల చేయనున్నారు. అయితే జగపతి బాబుని చరణ్ వద్దనటానికి కారణం, జగపతి బాబు రెమ్యునరేషన్ ఎక్కువుగా ఉందనే చరణ్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: