చాలా గ్యాప్ తరువాత విక్టరి వెంకటేష్ నటించిన చిత్రం భారీ సక్సెస్ ని చూసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ గ్రాండ్ సక్సెస్ ని సాధించినా ఆ మూవీ సక్సెస్ క్రెడిట్ అంతా మహేష్ బాబుకే వెళ్ళింది. ఆ తరువాత వెంకటేష్ నటించిన చిత్రాలు ఏవి కూడ అంతగా సక్సెస్ ని సాధించలేకపోయాయి. అయితే తను తాజాగా నటించిన దృశ్యం మూవీ, థియోటర్స్ ని హిట్ చేయటమే కాకుండా, భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం’. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ అనంతరం అంతగా సక్సెస్ సాదించలేదని క్రిటిక్స్ సైతం కామెంట్ చేశారు. మూవీ రిలీజ్ అనంతరం ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ చూస్తే, టాలీవుడ్ అంతా ఆశ్ఛర్యపడుతుంది. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఇదిలా ఉంటే దృశ్యం మూవీకి ఓవర్సీస్ లోనూ గ్రేట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఓవర్సీస్ లో దృశ్యం రెండు రోజుల కలెక్షన్స్ దాదాపు కోటి రూపాయలుకు పైగా లెక్క తేలింది. ఈ మధ్య కాలంలో వెంకటేష్ మూవీకి ఈ రేంజ్ లో ఓపెనింగ్ రావడం అనేది ఈ మూవీతోనే. దానికి సంబంధించిన డిటైల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓవర్సీస్ కలెక్షన్స్ (డాలర్స్ లో) గురువారం ప్రీమియర్స్ షో - $ 13,859 శుక్రవారం షో - $ 65,365 శనివారం - $ 88,431 మొత్తం $ 167,655 =1.01 కోట్ల రూపాయలు (ఇండియన్ కరేనీ ప్రకారం )

మరింత సమాచారం తెలుసుకోండి: