టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ ఫిల్మ్ మేకర్స్ లో రామ్ గోపాల్ వర్మ కచ్ఛితంగా ఉంటారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ కొత్త ఒరవడిని, సరి కొత్త ట్రెండ్ ని పరిచయం చేసింది వర్మనే. అందుకే తెలుగు చలన చిత్ర రంగంలో వర్మ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. వర్మ అంతటితో ఆగకుండా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ తనదైన బ్లాక్ బస్టర్ మూవీలను అందించి తన సత్తా ఏంటో చాటాడు. అయితే గత కొంత కాలంగా రామ్ గోపాల్ వర్మ రేంజ్ కి సరిపోయో విధంగా ఎటువంటి మూవీని తీయలేకపోతున్నాడు. తను తీస్తున్న మూవీలు అన్ని కేవలం బిజినెస్ కోసం తీస్తున్న మూవీలు తప్ప, సంచలనం క్రియేట్ చేసే మూవీలు ఏ మాత్రం కాదు. ఇదిలా ఉంటే వర్మ సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాడు. తను తాజాగా తీసిన ఐస్ క్రీమ్ మూవీ బాక్సాపీస్ వద్ద చతికిల పడటంతో ఆ మూవీకి హైప్ క్రియేట్ చేయటం కోసం వర్మ ట్విట్టర్ అకౌంట్ నుండి హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. ఐస్ క్రీమ్ మూవీకి సంబంధించిన బిహైండ్ ద టాక్స్ ని బయటకు చెబుతూ, అలాగే తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో బూతు బొమ్మలను, బూతుకొమేటషన్స్ ని పోస్ట్ చేస్తున్నాడు. దీంతో వర్మకి అందరూ ఏమైందో అని అనుకున్నారు. అయితే దానికి సంబంధించిన వివరణ ఇచ్చుకుంటూ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయబడిందంటూ మేసేజ్ ఇచ్చాడు. గత కొద్ది రోజుల నుండి తన అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని, ఎవరు ఆ విధంగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారో తనకి తెలియదని వివరణ ఇచ్చుకున్నాడు. అయితే వర్మ చెబుతున్న మాటల్లో ఎంత నిజం ఉందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఎందుకంటే వర్మ అకౌంట్ నుండి వచ్చిన బూతు పోస్టింగ్ లు, వర్మ మెంటాలికి దగ్గరగా ఉండటంతో ఆ పోస్టింగ్ లని వర్మనే పోస్ట్ చేసాడని ఇప్పటికీ అందరూ అదే అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: