బుల్లితెరమీద ఫెయిర్ నెస్ క్రీముల యాడ్స్ లో ఎక్కువగా కనిపించే యామి గౌతమ్ తన సినిమాల కన్నా ఎక్కువగా ఈ యాడ్స్ వల్ల సంపాదిస్తుంది అని అంటారు. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామి చెప్పిన నిజాలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘‘మీ సౌందర్య రహస్యం ఏమిటి?’’ అని ప్రశ్నిoచిన ఆ ఇంటర్వ్యూ యాంకర్ కు తల తిరిగేలా సమాధానం ఇచ్చింది యామి. ‘‘మీరు ఎన్నోరకాల కాస్మొటిక్ యాడ్ లలో నటించారు. ముఖ్యంగా ఫెయిర్ నెస్ గురించి చాలానే ప్రచారం చేశారు. కానీ మీరు ఎటువంటి కాస్మొటిక్స్ ఉపయోగిస్తారు..?’’ అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన సౌందర్యం కోసం తాను ఎటువంటి ఫెయిర్ నెస్ క్రీములను వాడననీ దానికి బదులు ఒక మంచి సబ్బుతో ముఖం కడుక్కుని నచ్చిన ఫ్రూట్ జ్యూస్ లు తాగుతూ టైమ్ కు తింటూ చాలినంత నిద్ర పోవడం వల్ల తాను అందంగా ఉండటానికి కారణం అని చెప్పి తనకు భారీగా డబ్బులిస్తున్న ఫెయిర్ నెస్ క్రీముల కంపెనీలకు షాక్ ఇచ్చింది.  అయితే డబ్బు గుర్తుకు వచ్చింది కాబోలు తను అన్న మాటను గుర్తించి సద్దుకుని నేటితరం అమ్మాయిలు ఫెయిర్ నెస్ క్రీమ్ లు వాడటం మంచిదే అంటూ యూటర్న్ తీసుకుంది. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులతో పాటు ఈ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కూడా యామి మాటలకు నోరు వెళ్ళ బెట్టారు. ఏదిఏమైతేనేమి యామి బ్యూటీ సీక్రెట్ జనానికి తెలిసి పోయింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: