జూనియర్‌ ఎన్టీఆర్‌ తండ్రి అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని రెయిన్ బో హాస్పటల్ లో జూనియర్ భార్య లక్ష్మి ప్రణతి మగ బిడ్డకు తల్లి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త తెలియగానే యంగ్ టైగర్ అభిమానులతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ శ్రేయోభిలాషులు, సన్నిహితులు జూనియర్ కు వరస పెట్టి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ అభిమానులు అయితే తమ హీరోకి వారసుడు వచ్చాడు అని తెగ సంబరపడి పోతున్నట్లు టాక్.  వచ్చే నెల ‘రభస’ రిలీజ్ కాబోతూ ఉండటంతో ఇక జూనియర్ కు వరస పెట్టి అన్నీ శుభాలే అని అనుకోవాలి. మంచి జోష్ మీద ఉన్నజూనియర్ ఎన్టీఆర్ ఎపి హెరాల్డ్ శుభాకాంక్షలు. లిటిల్ బుడ్డోడు ఎలాగ ఉంటాడో తెలియాలి అంటే జూనియర్ అభిమానులు మరి కొన్ని రోజులు ఈ లిటిల్ జూనియర్ ఫోటోల కోసం ఆగలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: