అతిలోక సుందరి శ్రీదేవికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ స్టార్ డం తగ్గలేదు. తను నటించాలే కాని, తనకంటూ ప్రత్యేక పాత్రలని క్రియేట్ చేయటం కోసం బడా దర్శకుల వద్ద నుండి యువ దర్శకుల వరకూ తెగ పోటీ పడటానికి రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి టాపిక్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జాన్వి ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇస్తుందా? అంటూ చాలా మంది కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా జాన్విని ఏ హీరోతో ఎంట్రి చేయాలి? ఏ వారసుడుతో ఎంట్రి ఇప్పించాలి? వంటి చర్చలు కూడ ఇప్పటికే శ్రీదేవి ఇంట్లో జరిగాయి. అయితే ఫైనల్ గా శ్రీదేవి మాత్రం జాన్వి హీరోయిన్ ఎంట్రికి ఇంకా సమయం ఉందని గట్టిగా చెబుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు జాన్వితో పరిచయం పెంచుకోవటం కోసం బిటౌన్ హీరోలు తెగ పోటీ పడుతున్నారు. జాన్వితో డేటింగ్ చేయటానికి బిటౌన్ కి చెందిన ఓ యువ హీరో సిద్ధంగా ఉన్నాడని, ఇప్పటికే వీరిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ ఉందంటూ తాజాగా బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో జాన్వి డేటింగ్ వ్యవహారం బిటౌన్ అంతా స్ప్రెడ్ అయింది. అంతే కాకుండా జాన్వి ఎఫైర్ నడుపుతున్న వ్యక్తితోనే తన ఫిల్మ్ కెరీర్ ఎంట్రి ఉంటుందనే సమాచారం కూడ బటౌన్ లో వినిపిస్తుంది. ఏదేమైనా శ్రీదేవి ఫిల్మ్ కెరీర్ ఎంత క్లీన్ గా ఉందో, వారి కూతుళ్ళ విషయంలో అది కుదరకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తుంది. రీసెంట్ గా శ్రీదేవి ఓ ఫంక్షన్ కి అటెండ్ అయితే తన కూతురు డేటింగ్ వ్యవహారాన్ని ఎవరో శ్రీదేవి ముందు ఉంచారంట. దాంతో ఒళ్ళు మండిపోయిన శ్రీదేవి తన కుమార్తె చదువుకుంటోందని, తన సినీ రంగ ప్రవేశం ఇప్పట్లో ఉండదు. అలాగే తను ఎవ్వరితోనూ డేటింగ్ లో లేదు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్న అసత్య ప్రచారం. ఎవ్వరూ దీనిని నమ్మాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టం చేశారు. తన కూతురు సినీ తెరంగేట్రం గురించి ఎందుకంత ఆసక్తి చూపుతున్నారో తనకి అర్థం కావడం లేదు అంటూ మీడియాపై విరుచుకుపడిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: