పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి నటసింహం బాలక్రిష్ణ సినిమాలు విడుదలైందంటే టిక్కెట్లకు ఒక రేంజిలో డిమాండ్ ఉంటుంది ని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య తెలుగులో మల్టీస్టారర్ చిత్రలు జోరు పెరుగుతోంది. దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్లు కురిపించే కాంబినేషన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంకటేస్ కాంబినేషన్లో ‘గోపాలా గోపాలా చిత్రం తెరకెక్కుతోంది. ఈ క్రమంలో కొందరు దర్శకులు నిర్మాతలు పవన్ బాలయ్య కాంబినేషన్లో సినిమా చేస్తే మంచి ఫలితాలు పొందె అవకసలు వుంటాయి ఆలోచన చేస్తున్నారట. ఈ మధ్య పవన్ టీడీపీ పార్టీ తరుపున ప్రచారం చేయడంతో బాలయ్య, పవన్ మధ్య సంబంధాలు బాగున్నాయని.ఇద్దరినీ ఒప్పించి ఓ సినిమా ప్లాన్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలు చేస్తున్నారట. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా 100 కోట్ల మార్కు దాటలేదు. ఇలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్లు ట్రై చేస్తే పరిశ్రమ ఆదాయం పెంచవచ్చనేది పలువురి అభిప్రాయం. పవన్ బాలయ్యల విరి ఇద్దరి ఇమేజ్‌కు సరిపోయే విధంగా కథలను సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: