బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఘన విజయం సాధించిన మూవీ క్వీన్. క్వీన్ మూవీని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిమేక్ చేయాలని త్యాగరాజన్ ఈ మూవీకి సంబంధించిన రిమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. అయితే క్వీన్ మూవీలో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ క్వీన్ మూవీలో హీరోయిన్ గా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లు సమంత, త్రిష, శ్రీయ, నయనతార ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో చార్మి, క్వీన్ మూవీ రిమేక్ లో హీరోయిన్ గా ఫైనల్ అయిందనేది తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. క్వీన్ మూవీ సౌత్ మూవీ రిమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్న నిర్మాతలు కూడ చార్మి అయితే ఈ మూవీలో హీరోయిన్ గా కరెక్ట్ గా సరిపోతారని భావించారట. అందకు క్వీన్ మూవీలో చార్మిని ఫైనల్ చేసినట్టుగా వారు బయటకు చెబుతున్నారు. ఇందులో ఉన్న అసలు విషయాన్ని తెలుసుకుంటే ఇదంతా ఓ పెద్ద గాసిప్ అని బయటపడింది. చార్మిని ఈ విషయంపై స్ట్రయిట్ గా అడిగితే తన వద్దకూ ఎవ్వరూ క్వీన్ మూవీ ప్రపోజల్ ని తీసుకురాలేదని చెప్పుకొచ్చింది. అయితే తను మాత్రం క్వీన్ రిమేక్ లో నటించటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. క్వీన్ లాంటి మూవీలో నటించటానికి తను ఎప్పుడో రెడీ అని, కాని ఇప్పటి వరకూ ఎవ్వరూ సంప్రదించకుండా, నా పేరు బయటకు రావడం అనేది ఆశ్ఛర్యానికి గురి చేస్తుంది అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: