వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ పూర్తిగా నీరుగారిపోయి దియేటర్ల నుంచి మాయం అయిపోయినా ‘ఐస్ క్రీమ్’ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. వర్మ అతితక్కువ ఖర్చుతో సినిమాలు ఎలాతీయాలి అన్న విషయం పై పాఠాలు చెపుతూ యూట్యూబ్ లో సందడి చేసిన విషయాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి రామ్ గోపాల్ వర్మ ప్రమోట్ చేస్తున్న ఈ కొత్త కాన్సెప్ట్ టాలీవుడ్ చరిత్రను మార్చే అవకాసం ఉందని పొగుడుతూ ట్విట్ చేసాడు. అయితే ‘ఐస్ క్రీమ్’ సినిమాను ఉదాహరణగా తీసుకోకుండా అందులోని కాన్సెప్ట్ ను మాత్రమే ఉదాహరణగా తీసుకోవాలని వర్మ పెట్టిన ట్విట్ రాజమౌళికి మరో విధంగా అర్ధమై హై బడ్జెట్ లో సినిమాలు తీసే రాజమౌళికి లో బడ్జెట్ లో కొత్త ప్రయోగాలు చేస్తూ తీసిన సినిమాలు నచ్చవు కాబోలు అంటూ చురకలు వేసాడు రామ్ గోపాల్ వర్మ. జరుగుతున్న మాటల యుద్ద ప్రమాదాన్ని గుర్తించిన రాజమౌళి తెలివిగా తాను ‘ఐస్ క్రీమ్’ సినిమాను విమర్శించ లేదు అంటూ వివాదానికి ముగింపు పలికాడు. అయినా ఈ ప్రముఖ దర్శకులు ఇద్దరి మధ్యా జరిగిన ట్విటర్ యుద్ధం మాత్రం టాలీవుడ్ కు ఆశక్తి దాయకంగా మారింది. ఇది ఇలా ఉండగా వర్మ చిన్న సినిమాల కాన్సెప్ట్ ను పొగడ్తలతో ముoచేస్తూ నిన్న మంచు వారి అబ్బాయి విష్ణు వర్మను పొగుడ్తూ మీడియా ద్వారా బహిరంగ లేఖ వ్రాయడంతో వర్మ కాన్సెప్ట్ కు రోజురోజుకు బలం పెరుగుతోంది అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: