మొన్నటి వరకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా బాలీవుడ్ ఏలిన దీపిక నేడు మోస్ట్ సెక్సీ బ్యూటీగా బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా కేరళా ప్రభుత్వ స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ పోటీ పరిక్షల ప్రశ్నా పత్రాలలో కూడ దీపిక నామస్మరణ జరగడం అందని ఆశ్చర్య పరుస్తోంది.  ఉద్యోగానికి వచ్చే అభ్యర్ధుల జనరల్ నాలెడ్జిని పరిక్షీంచాల్సిన ప్రశ్నా పత్రాలలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కత్రినా కైఫ్, దీపిక పడుకొనేల్లో ఎవరు పొడవు? అనే ప్రశ్న ఎస్ఎస్‌సీ పేపర్లో కనిపించడంతో ఆ పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్ధులు షాక్ అయ్యారట.  అంతేకాకుండా తాము రాస్తున్నది జనరల్ నాలెడ్జి పేపరా? లేక బాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించిన పోటీ పరిక్షా? అనే విషయం అర్ధంకాక ఆ పరీక్షా రాస్తున అభ్యర్దుల మైండ్ బ్లాంక్ అయింది అనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ పేపరులో బాలీవుడ్ బ్యూటీస్ కు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి అన్న విషయం మీడియాకు లీక్ కావడంతో ఈ పరీక్షలను నిర్వహించిన ఎస్ఎస్‌సి చైర్మన్ ఎ భట్టాచార్య విచారం వ్యక్తం చేశారు.  అయితే కేరళా మహిళా కమిషన్ మటుకూ ఈ వ్యవహారం పై ఫైర్ అవ్వడమే కాకుండా పోటీ పరీక్షలలో హీరోయిన్ లపై ప్రశ్నలు ఏమిటీ అని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే రాబోతున్న రోజులలో సివిల్ సర్వీసెస్ పరిక్షలలో కూడ సినిమా తారల పై ప్రశ్నలు ఉండే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: