విలక్షణ నటుడు కమలహాసన్ ఏదైనా ఒక సినిమా ఎత్తుకుంటే చాలు ఆ సినిమా కమల్ వ్యవహార శైలితో సంబంధం లేకుండానే సమస్యల ఊబిలోకి వెళ్ళి పోతోంది. గత సంవత్సరం విడుదలైన ‘విశ్వరూపం’ సినిమా కస్టాలు మరిచిపోకుండానే కమల్ ప్రస్తుతం నిర్మిస్తున్న ‘విశ్వరూపం-2’ సినిమాను ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి అనే వార్తలు ఈ మధ్య కాలంలో వచ్చాయి. ఈ సమస్యలు ఇలా ఉండగా మోహన్ లాల్, వెంకటేష్ లకు అదృష్టాన్ని ఇచ్చిన ‘దృశ్యం’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తూ మూడు రోజులక్రితమే ఈ సినిమాకు క్లాప్ కొట్టించుకున్నాడు. నదియా చేసిన పాత్రకు శ్రీదేవిని ఇంచుమించుగా ఓకె కూడ చేసుకున్నాడు. ఆగష్టు మొదటి వారం నుండి షూటింగ్ కు వెళ్ళ బోతున్న ఈ సినిమాకు కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం కోర్టు షూటింగ్ ఆపమని ఆదేశాలు జారీ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. మలయాళంలో తన స్వీయ రచనతో డైరెక్ట్ చేసిన జీతు‌జోసఫ్ తన బుక్‌లోని అంశాలను కాపీ కొట్టి ఆ సినిమా తీశాడని, కేరళకే చెందిన మరో రైటర్ కం డైరెక్టర్ సతీష్‌పాల్ కోర్టుకు వెళ్ళడంతో ఇపుడు బ్రేక్ పడిందని తెలుస్తోంది. మళయాళ, తెలుగు భాషల్లో హిట్ సాధించిన ఈ సినిమా లాభాల్లో తనకూ వాటా ఇవ్వాలని సతీష్ వాదిస్తున్నట్టు సమాచారం.  మరోవైపు ఇప్పటికే జపాన్ నవల దివోషన్ ఆఫ్ సస్పెక్ట్ కు ‘దృశ్యం’ సినిమా కాపీ అంటూ బాలీవుడ్‌లో నిర్మాత ఏక్తా కపూర్ లీగల్ నోటీసులను ఈ సినిమాను రీమేక్ చేసిన వారికి ఇప్పటికే ఇచ్చిన విషయం మీడియా ద్వారా వెలుగు లోకి వచ్చింది. ఏమైనా ‘దృశ్యం’ రగడ రోజురోజుకు సమస్య పెద్దది అవుతున్నట్లే అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: