సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ సమంత. ప్రస్తుత సమయంలో సమంత వరుస మూవీలని ఒప్పుకుంటూ వెళుతుంది. దీని కారణంగా సమంత నటిస్తున్న మూవీలకి ప్రమోషన్స్ డేట్స్ దొరకకుండా ఉండిపోయింది. టాప్ హీరోల మూవీలకి సమంత బల్క్ కాల్షీట్స్ ని ఇస్తుంది. ఒక మూవీకి దాదాపు 20 రోజుల కాల్షీట్స్ ని, అలాగే నెల రోజుల కాల్షీట్స్ ని రెండు సార్లుగా, మూడు సార్లుగా ఇచ్చుకుంటూ వస్తుంది. ప్రస్తుతం సమంత టాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలు చేస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘రభస’. కొద్ది రోజుల క్రితం పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళిన సమంత షూటింగ్ అనంతరం హైదరాబాద్ తిరిగొచ్చి, వెంటనే సమంత చెన్నై ఫ్లైట్ ఎక్కింది. అలాగే కోలీవుడ్ లోనూ రెండు సినిమాలలో నటిస్తుంది. విజయ్, ఏఅర్ మురగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కత్తి’ ఒకటి. విక్రమ్ సరసన విజయ్ మిల్టన్ సరసన నటిస్తున్న సినిమా మరొకటి. ఈ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా మరికొన్ని రోజులు సమంత చెన్నైలో గడపనుంది. మధ్యలో ‘అంజాన్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. సమంత నటించిన ‘అల్లుడు శీను’ ఈ నెల 25న విడుదల అవుతుంది. వీటి తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది. ఈ విధంగా సమంత ఫుల్ బిజి షెడ్యూల్ తో ఉంది. ఇదిలా ఉంటే సమంతని నెల రోజుల ముందుగా వారి మూవీ ప్రమోషన్స్ కోసం డేట్స్ ని తీసుకొని అందుకు సంబంధించిన ఫ్లైయిట్స్ టికెట్స్ ని బుక్ చేయటం, హోటెల్ రూమ్స్ ని బుక్ చేయటం జరుగుతుంది. కాని చివరి నిముషం లో సమంత చేస్తున్న మార్పులకి, నిర్మాతలకి తల బొప్పి కడుతుంది. ఈ బ్యూటి ప్రమోషన్స్ పేరుతో నిర్మాతలకి ఖర్చు పెట్టే మొత్తం ఒక మూవీకి దాదాపు 30 లక్షలకి పైనే ఉంటుందని అంటున్నారు. ఒక్క అంజాన్ మూవీ కోసం నిర్మాత పబ్లిసిటి పేరుతో సమంత పై దాదాపు 47 లక్షలు ఖర్చు పెట్టాడట. అయితే తను ఆడియో ఫంక్షన్ కి రాకపోవడంతో నిర్మాత చాలా వరకూ నష్టపోయినట్టుగా కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: