బాలీవుడ్ చిత్ర పరిశ్రలో అమీర్ ఖాన్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఈయనను మిస్టర్ పర్ఫెక్ట్ కూడా అంటారు. వివాదాలకు దూరంగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అమీర్ ఏ చిత్రంలో అయిన పాత్రకు తగ్గట్టుగా అందులో లీనమైపోతుంటాడు. అందుకే తక్కువ సినిమాలు అయినా ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పడు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచాడు అమీర్ కారణం ఈయన నటించ బోయే ఓ సినిమాలో నగ్నంగా నటించనున్నట్లు తెలపడం. తాజాగా అమీర్ ఖాన్ నటించబోయే ఓ చిత్రంలో అమీర్ నగ్నంగా నటించనున్నట్లు సమాచారం. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ''పీకే '' అనే పేరు నిర్ణయించారట . ఈ చిత్రంలో అమీర్ సరసన అనుష్కా శర్మ నటించనుంది. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ నగ్నంగా నటిస్తే ఓ ప్రత్యేకత ఉంటుంది మరి ఈ హీరో గారు నగ్నంగా నటించి ఎంతమందిని ఆకర్షిస్తారో సినిమా వస్తే గాని తెలియదు మరీ !

మరింత సమాచారం తెలుసుకోండి: