ప్రముఖ హాస్య నటుడు ఎమ్ ఎస్ నారాయణ తాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకో బోతున్నానని నిన్న భీమవరంలో తెలియచేసారు. గత 17 సంవత్సరాలుగా 700 వందల సినిమాలలో నటించినందుకు అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసిన నటుడిగా తనకు ఈ గౌరవం లభిస్తున్నట్లు ఎమ్ ఎస్ నారాయణ మీడియాకు తెలియచేసారు. ప్రస్తుతం తాను ‘గోవిందుడు అందరి వాడే’తో పాటు 15 సినిమాల్లో నటిస్తున్నానని అంటూ తనకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టిన ‘దూకుడు’ సినిమాతో తన రేంజ్ పెరిగిందని అంటూ ఆ సినిమా తన జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది అని అంటున్నారు.  ప్రస్తుతం సినిమాలలో ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మాండలికాన్ని సంభాషణలుగా వాడుతున్నా రాబోయే రోజుల్లో తెలంగాణ మాండలికంలో కూడా ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశం ఉంది అని తన అభిప్రాయాన్ని తెలియచేసారు ఎమ్ ఎస్. దీనికి కారణం ప్రస్తుత సినీ రంగానికి నైజాం ప్రాంతం నుంచే 50 శాతం ఆదాయం రావడం మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే అని అంటున్నారు.  భవిష్యత్ లో తెలంగాణ ఆర్టిస్టులతోనే పూర్తిస్థాయిలో సినిమాలు తీసే రోజులు దగ్గరలో ఉన్నాయి అని అంటూ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తే బాగుంటందని అభిప్రాయ పడ్డారు ఈ విలక్షణ హాస్య నటుడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: