దేవీశ్రీప్రసాద్ కు యూత్ లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టాప్ హీరోల దగ్గర నుంచి టాప్ దర్శకుల వరకు అందరూ దేవిశ్రీనే కోరుకుంటున్నారు. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ ను కూడా దేవిశ్రీ హవా షేక్ చేస్తోంది. తన సినిమాలతో అనుక్షణం బిజీగా ఉండే దేవిశ్రీ తన సినీ సంగీతానికి కొంత విరామం ప్రకటించి ప్రస్తుతం అమెరికాలో స్టేజ్ షోలు చేస్తున్న సంగతి తెలిసిందే.  అమెరికాలో దేవిశ్రీ నిర్వహిస్తున్న స్టేజ్ షోలకు విపరీతమైన క్రేజ్ రావడమే కాకుండా ఆ స్టేజ్ షోలు అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువగా సక్సస్ అయ్యాయి అనే వార్తలు వస్తున్నాయి. దేవిశ్రీ ఈ స్టేజ్ షోలకు మంచి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా చాల ఆర్గనైజ్డ్ గా ఈ షోలను నిర్వహిస్తూ అమెరికాలోని తెలుగువారిని షేక్ చేస్తున్నాడు. ఈ టూర్ వల్ల దేవిశ్రీకి కోట్ల పై ఆదాయం వస్తున్నట్లు టాక్. ఈ నేపధ్యంలో దేవీశ్రీప్రసాద్ స్టేజ్ షో ఈరోజు అమెరికాలోని ఇల్లినోయిస్ రాష్ట్రంలో జరగబోతోంది. ఈ స్టేజ్ షోను పురస్కరించుకుని ఇల్లినోయిస్ రాష్ట్ర గవర్నర్ 26 జూలై 2014ను దేవీశ్రీ ప్రసాద్ డే గా ప్రకటించారు అని వార్తలు వస్తున్నాయి. అమెరికాలాంటి సంపన్న దేశంలో మన టాలీవుడ్ సంగీత దర్శకుడికి ఇటువంటి అరుదైన గౌరవం పొందడం టాలీవుడ్ సంగీత సినీ ప్రపంచానికే గౌరవంగా మారింది అంటూ మాటలు వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: