అరుంధతి సినిమాలోని బొమ్మాళీ ఫేమ్ సోనూ సూద్ చేత ప్రిన్స్ మహేష్ తన 'ఆగడు' సినిమా కోసం డ్యాన్సులు చేయిస్తున్నాడని లేటెస్ట్ టాక్. ఈ వార్తలను సోనూ సూద్ స్వయంగా తెలిపాడు. ‘ఆగడు’ సినిమాలో ప్రకాష్ రాజ్ తప్పుకోవడంతో ఆ పాత్రలోకి ప్రవేసించిన సోనూ సూద్ తాను తన అభిమానుల కోసం పెట్టిన ట్విటర్ లో ఈ విధంగా తెలియచేసాడు.  “ హైదరాబాద్ వెళ్తున్నా 'ఆగడు' సాంగ్‌లో నేను కూడా స్టెప్స్ వేస్తున్నా” అంటూ ట్విట్ ముగించాడు. 'దూకుడు', 'కందిరీగ' తర్వాత సరైన రోల్స్ పడక టాలీవుడ్ సినిమాలలో వెనక పడిన సోనూ సూద్ 'ఆగడు'లో మహేష్‌కు దీటుగా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయ్. ఇది ఇలా ఉండగా 'ఆగడు' కోసం శృతి హసన్ ఐటంసాంగ్ షూట్ శుక్రవారం నుండి స్టార్ట్ అయిందని ఫిలింనగర్ టాక్. శ్రుతిహాసన్ ఐటమ్ సాంగ్ లో మహేష్ ఇప్పటి వరకు వేయని స్టెప్స్ తన అభిమానుల కోసం ఈపాటలో వేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.  ఏ విషయంలోనూ తన అభిమానులకు అసంతృప్తి కలగకుండా మహేష్ తన ‘ఆగడు’ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: