30 సంవత్సరాల వయసు దాటి పోతున్నా అనుష్క క్రేజ్ తగ్గడం లేదు సరికదా ఆమె చేస్తున్న భారీ సినిమాలతో మరింత పెరిగి పోతోంది. యూత్ కూడ అనుష్కను ఇప్పటికీ అభిమానిస్తూ ఉండటంతో ఎంత మంది హీరోయిన్స్ వస్తున్నా అనుష్క హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ ప్రేక్షకులకు అభిమాన దేవతగా తన క్రేజ్ ను కొనసాగిస్తున్న అనుష్క పై తనకున్న అభిమానాన్ని బహిరంగంగా వేదిక పై చెప్పి ఒక తమిళ దర్శకుడు సంచలనం చేసాడు. ప్రస్తుతం సూర్యతో అంజాన్ సినిమా చేస్తున్న లింగుస్వామి, తాజాగా అంజాన్ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ సినిమాలో సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా సూఫీశైలిలో సాగే ఓ ప్రణయ గీతాన్ని స్వరపరిచారు. ఈపాట గురించి వేదిక మీద మాట్లాడుతూ ఆ ఆడియో ఫంక్షన్ యాంకర్ ఈపాట వింటుంటే ఎవరికి వారు ఎవరో ఒకరిని గుర్తుచేసుకుంటారని అని జోక్ చేస్తూ దర్శకుడు లింగుస్వామిని చూసి మీకు ఎవరు గుర్తుకు వస్తున్నారు అని ప్రశ్నిస్తే తనకు అనుష్క గుర్తుకువచ్చింది అని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచాడు లింగు స్వామీ.  సమంతను హీరోయిన్ గా పెట్టి సినిమా తీసిన లింగు స్వామికి హఠాత్ గా అనుష్క ఎందుకు గుర్తుకు వచ్చిందో ఆయనకే తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: