టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న హీరో మహేష్ బాబు. మహేష్ బాబు ప్రస్తుతం ఫిల్మ్ కెరీర్ ని ఫుల్ బిజిగా గడుపుతున్నాడు. దాదాపు మరో నాలుగు సంవత్సరాల వరకూ మహేష్ బాబు చేయనున్న మూవీలు ఫిక్స్ అయిపోయాయి. ఇదిలా ఉంటే మరో వైపు ప్రిన్స్ బ్రాండ్స్ తో ఫుల్ బిజిగా ఉన్నాడు. రీసెంట్ గా బోంబేకి వెళ్లి కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. తాజాగా మహేష్ ఖాతాలోకి మరో బ్రాండ్ చేరింది. ప్రస్తుతం సమంత బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న పారాగాన్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ కి మహేష్ కూడ ఎంపిక అయ్యాడు. ఇప్పటికే టాప్ స్టార్ డం కలిగి ఉన్న హీరోయిన్ సమంతని పారాగాన్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తూనే, ఇంతలోనే మహేష్ బాబుని సైతం ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా సెలక్ట్ చేసుకోవటంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు ఇప్పటి వరకూ థమ్స్ అప్, వివేల్, ప్రోవోగ్, ఐడియా, నవరత్న ఆయిల్స్, జాస్ అలుక్కాస్, టివిఎస్, రాయల్ స్టాగ్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఈ లిస్ట్ లో తాజాగా ఫేమస్ చెప్పల్స్ బ్రాండ్ అయిన పారగాన్ కి కూడా చేరిపోయింది. దీంతో త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో యాడ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే పారాగాన్ సంస్థ త్వరలోనే సమంత ని ఈ ప్రొడక్ట్ నుండి తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం సంవత్సరం పాటు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ని తరవాత మరో సంవత్సరం పాటు కంటిన్యూ చేస్తామంటూ సమంతతో పారాగాన్ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఎంట్రితో పారాగాన్ సంస్థ ఒప్పందాలను మార్చుకోబోతుంది. సమంతని సంవత్సరం తరువాత తప్పించి మహేష్ బాబునే కంటిన్యూ చేయాలని కోరుకుంటుందట. మొత్తానికి మహేష్ బాబు, సమంతకి సూపర్ చెక్ పెట్టాడని ఇండస్ట్రీ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: