పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కథనాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీపై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అభిమానులలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటాడు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫీల్డ్ లోకి రాకముందు నుండి గబ్బర్ సింగ్2 మూవీపై ప్రత్యేకఆసక్తిని చూపుతున్నాడు. ఎందుకంటే గబ్బర్ సింగ్ సోరి పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన కథ గా టాలీవుడ్ చెబుతుంది. గబ్బర్ సింగ్2 స్టోరిని దాదాపు పవన్ కళ్యాణే పూర్తి చేశాడని టాలీవుడ్ టాక్. అలాగే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లోనూ పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఉందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ ఏ మూవీలో నటిస్తాడు? అసలు మూవీలకు గుడ్ బై చెబుతాడా? వంటి విషయాలు ఇప్పుడు చర్ఛకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కార్యచరణకు ఫిల్మ్ షూటింగ్స్ అడ్డుగా మారాయని గతంలో పవన్ భావించాడంట. అందుకే గబ్బర్ సింగ్2 మూవీ తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా రాజకీయంగా పార్టీని బలోపేతం చేయాలనుకున్నాడు. కాని తాజాగా పవన్ కళ్యాణ్ మరో స్టోరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మూవీతోనే పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతాడంట. అదే పవన్ కి ఎంతగానో నచ్చిన కోబలి మూవీగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ గా త్రివిక్రమ్ చేయనున్నాడు. గబ్బర్ సింగ్ 2 మూవీ షూటింగ్ పూర్తవ్వగానే మరో ఆరు నెలలు గ్యాప్ తీసుకొని ఈ కోబలి మూవీలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన అఫిషియల్ న్యూస్ త్వరలోనే వెల్లడికానుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: