సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ ఆగడు షూటింగ్ అనంతరం, ప్రిన్స్ తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన పనుల్లో బిజిగా మారబోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అశ్వనిదత్ నిర్మాతగా మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. అయితే ఈ మూవీ కి సంబంధించిన కాస్టింగ్ ఎంపిక ఇప్పటికే కొనసాగుతున్నట్టు నిర్మాత వద్ద నుండి వస్తున్న సమాచారం. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరన్నది కూడ సస్పెన్స్ గానే ఉంది. గతంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మహేష్ సరసన నటించడానికి అంగీకారం తెలిపింది. అయితే ఆ ప్రాజెక్ట్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. నిర్మాత అశ్వనిదత్ మహేష్ బాబు హీరోగా నవంబర్లో సినిమా ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘ఆగడు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని వెదికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ విషయంలో అలియాభట్ ని చిత్రయూనిట్ సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం అలియాభట్ హైదరాబాద్ కి వచ్చినప్పుడు తను జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తానని చెప్పుకొచ్చింది. అయితే అలియాభట్ ని కలిసిన అశ్వనీదత్ పి.ఆర్, మహేష్ బాబుతో నటిస్తావా అంటే తను దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అశ్వనీదత్ ఆఫీస్ నుండి త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ స్టేట్ మెంట్ వెలువడనుందని అంటున్నారు. అయితే అలియాభట్ కి రెమ్యునరేషన్ కూడ భారీగానే ఉంటుందంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఆగడు మూవీ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ అనంతరం దర్శకుడు కొరటాల శివ మూవీలో నటించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: