ఒక చిన్న ప్రశంస ఎంతటి వ్యక్తికైనా ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది అని అంటారు. చిన్న కాగితం ముక్కే కదా అని మనం ఒకొక్కసారి దానికి విలువ ఇవ్వం. కానీ దానికి ఉండే విలువ దానికి ఉంది అని అనిపించేటట్లుగా ఈమధ్య ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇలియానాకు ఒక విచిత్ర సంఘటన జరిగింది.  ఇలియానా ఎయిర్ పోర్ట్ లో తన విమానం గురించి ఎదురు చూస్తూ ఉంటే ఒక మహిళ ఇలియానా దగ్గరకు వేగంగా వచ్చి ఒక కాగితం ముక్కను ఆమె చేతిలో పెట్టి ఈ కాగితంలోని విషయాలు తప్పకుండా చదువు అని చెప్పి స్పీడ్ గా వెళ్ళి పోయిందట. అనుకోని ఈ సంఘటనకు షాక్ కు గురైన ఇలియానా ఆ కాగితంలో ఏముందో? అనుకుంటూ ఆత్రంగా చదివితే ఆ కాగితంలోని మాటలు ఇలీబెబీకి షాక్ ఇచ్చాయట. “నువ్వు తెర పై ఎంత అందంగా ఉన్నావో బయట కూడ అంత బాగున్నావు. నీ సినిమాలలో ‘బర్ఫీ’ అంటే నాకు చాల ఇష్టం నీవు చాల మంచి నటివి ఎక్స్ పోజింగ్ నీకు అనవసరం నీవు మంచి నటిగా నిలుస్తావు” అంటూ ఆమె రాసిన మాటలు పదేపదే చదువుకున్న ఇలియానా ఇప్పుడు ఆ కాగితాన్ని తన ట్విటర్ లో పెట్టి హడావిడి చేస్తూ తన ఆనందాన్ని తన అభిమానులతో పంచుకుంటోంది ఈ గోవా బ్యూటీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: