70 సంవత్సరాలు దాటిపోయినా మధ్యమధ్యలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా వాటి అన్నింటిని ఎదిరిస్తూ ఇప్పటికీ బాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు అమితాబ్. బిగ్ బి ఉదారహృదయానికి మచ్చుతునకగా పేర్కొనే సంఘటన ఒకటి ఈమధ్య బాలీవుడ్ లో జరిగింది. అమితాబ్ కు చాల సంవత్సరాలుగా పర్సనల్ మేకప్ మెన్ గా వ్యవహరిస్తున్న దీపక్  సావంత్ భార్య సరోద్ కు ఒక తీరని కోరిక ఉందట . అయితే అది కొంచం పెద్ద కోరిక కావడంతో తన భార్య కోరిక తీర్చలేక పోతున్నాడు దీపక్ సావంత్ . ఇంతకీ ఆ కోరిక ఎమిటంటే ఒక విలాసవంతమైన ఇంపోర్టెడ్ కారు కొనుక్కోవాలని దీపక్ భార్య సరోద్ కోరిక.  అయితే ఈ విషయం ఎలాగతెలిసిందో తెలియదు కాని దీపక్ భార్య కోరిక బిగ్ బి దృష్టికి వచ్చింది. దీనితో తనకు ఎనాటినుంచో సేవలు అందిస్తున్న దీపక్ దంపతులకు తానూ తరుచు వాడే రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి ఆ దంపతులకు షాక్ ఇచ్చాడు అమితాబ్. అత్యంత ఖరీదయిన ఈ బహుమతి తీసుకోవడం అమితాబ్ మకేప్ మాన్ దీపక్ కు ఇష్టం లేకపోయినా తన భార్య కోసం బిగ్ బి వద్ద తీసుకున్నాడట. ఇంత విలువైన బహుమానాన్ని అమితాబ్ దీపిక్ కు ఇవ్వడం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: