ఇండియన్ క్రికెట్ రంగంలో క్రికెట్ దేవుడిగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ క్రికెట్ గేమ్ నుండి రిటైర్ అయిపోయినా అతడు ఏమి చేసినా మీడియాకు సంచలనమే. అటువంటి సచిన్ నందమూరి సింహం బాలయ్యకు సవాల్ విసురుతున్నాడు అని కొంత మంది జోక్స్ వేస్తున్నారు.  తోడ కొట్టడం నందమూరి హీరోలకు వెన్నతో పెట్టిన విద్య. ‘సమరసింహారెడ్డి’ సినిమాలో బాలయ్య తోడ కొట్టితే ఆ సీన్ ఆ సినిమాను సూపర్ హిట్ చేయడమే కాకుండా ఈ సినిమా విడుదల అయి పుష్కకర కాలం దాటిపోతున్నా ఆ సీన్ ను ఇప్పటికీ బాలయ్య అభిమానులు మరిచిపోలేరు. చివరకు జూనియర్ కూడ తన బాబాయిని అనుసరిస్తూ ‘ఆది’ సినిమాలో తొడకొట్టి తనకు కూడ టాప్ హీరో ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.  అటువంటి తోడ కొట్టే సీన్ ను క్రికెట్ దేవుడు సచిన్ జనం మధ్య చేయడం బట్టి సచిన్ కూడ బాలకృష్ణ అభిమానిగా మారిపోయాడా అని అనిపించేడట్లుగా చేసింది. ఇక వివరాలలోకి వెళితే జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి అతిధిగా వచ్చిన సచిన్ సరదాగా అమీర్ ఖాన్ తో కలిసి ఆ గ్రౌండ్ కు వచ్చి తోడగొట్టిన ఫోటో ఇప్పుడు మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. అభిషేక్ బచ్చన్ స్పాన్సర్ చేసిన ఈ కబడ్డీ పోటీలలో సచిన్ అతిధిగా వచ్చి ఈ ట్రిక్ చేసాడు. అయితే ఈ ఫోటోను చూసిన బాలకృష్ణ ఏమంటాడో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: