సంవత్సరం గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్, వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘గోపాలా గోపాలా' సినిమాకు సంభందించి ఒక ఆశక్తికర వార్త ఫిలిం నగర్ లో హడావిడి చేస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ ఎటువంటి సూచనలు చేయడంలేదని ఆ సినిమా యూనిట్ చెపుతోంది అనే వార్తలు వచ్చి కొద్ది రోజులు కుడా గడవకుండానే పవన్ ఈ సినిమాలో ఒక పాటను పెట్టమని ఈసినిమా యూనిట్ కు సలహాలు ఇస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి . ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తలు ప్రకారం పవన్ కళ్యాణ్ కు మొట్టమొదటి కమర్షియల్ హిట్ అందించిన ‘గోకులంలో సీత' చిత్రంలోని ‘గోకుల కృష్ణా గోపాలా కృష్ణా మాయలు చాలయ్యా' అనే పాటను ‘గోపాలా గోపాలా' చిత్రంలో ఎక్కడో ఒక చోట పెడితే బాగుంటుందని పవన్ దర్శకుడు కిషోర్‌ పార్థసాని (డాలి)కి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.  పవన్ పవర్ స్టార్ గా మారక ముందు 1997లో విడుదల అయిన ‘గోకులంలో సీత’ సినిమా ఆ రోజుల్లో పవన్ కు మాస్ ఇమేజ్ ఇచ్చిన మొట్టమొదటి సినిమా. అయితే పవన్ తన సినిమాలోని అప్పటి పాటను ఇప్పడు గోపాలుడిలో ఎందుకు పెట్టమంతున్నాడు అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా పవన్ కు ‘గోకులంలో సీత’ సినిమా పై ఉన్న సెంటిమెంట్ అనుకోవాలి. ఏమైనా ఈ వార్తలలో ఎన్ని నిజాలో రానున్ను రోజులలో తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: