బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు బయటకు వస్తే చాలు, అభిమానులు చుట్టూ కమ్ముకుంటారు. అభిమానుల నుండి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో అస్సలు కుదరదు. ఆ సమయంలో హీరో పెట్టుకున్న ప్రవేట్ సెక్యూరిటీ ఫోర్స్ అభిమానులని చితకబాదేస్తుంటారు. ఇటువంటి సందర్భాలు చాలాసార్లు జరుగుతుంటాయి. అయితే దీనికి విరుద్ధంగా తాజాగా బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హీరోతో ఫోటోలు దిగటానికి వచ్చిన అభిమానులని, సెక్యూరిటి గార్డ్ లు తోసివేయడంపై హీరో మండిపడ్డాడు. దీనికి సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ మీకు అందిస్తుంది. సల్మాన్ ఖాన్ తాజాగా ముంబైలోని మెహాబూబ్ స్టూడియోస్ లో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. షూటింగ్ బ్రేక్ సమయంలో తనని కలవడానికి వచ్చిన అభిమానులతో కలిసి సల్మాన్ ఫోటోలు దిగుతున్నాడు. ఆ సమయంలో ఒక అభిమాని సల్మాన్ తో ఫొటో దిగే సమయంలో అతని నడుము చుట్టూ చెయ్యి వేసే ప్రయత్నం చేశాడు. అది చూసిన సల్మాన్ బాడీగార్డ్ ఒకతను వెంటనే, ఆ అభిమాని చెయ్యు పట్టి బలంగా లాగి, సల్మాన్ నుండి దూరంగా జరిపే ప్రయత్నంలో ,ఆ బాడీగార్డ్ చేయి సల్మాన్ అభిమాని చేతికి బలంగా తాకింది. అది చూసి ఆగ్రహించిన సల్మాన్ వెంటనే , అభిమానులందరి సమక్షంలో బాడీగార్డ్ చెంప చెళ్ళుమనిపించాడు. ఇంకోసారి ఎవరూ తన అభిమానులతో అంత దురుసుగా ప్రవర్తించవద్దు అంటూ అక్కడ ఉన్న మిగతా బాడీగార్డ్‌లు, మరియు తన వ్యక్తిగత సహాయ సిబ్బందికి సల్మాన్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఇది జరిగిన వెంటనే మరో రోజు కూడ ఇదే సీన్ రిపీట్ అయింది. ప్రవేట్ ఫంక్షన్ కి అటెండ్ అయిన సల్మాన్ చుట్టూ అభిమానులు చేరడంతో మళ్ళీ సెక్యూరిటి తన చేతి వాటాన్ని చూపించింది. దీంతో పర్సనల్ సెక్యూరిటిని అక్కడే ఉండమని తనే ఫంక్షన్ లోకి వెళ్ళి ఓ అరగంట పాటు పిచ్చాపాటిగా మాటలు మాట్లాడి అక్కడి ఫ్యాన్స్ తో ఫోటోలు దిగి తిరిగి వచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: