సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పడు ఒకే ఒక్క నిర్మాత పేరు అంతటా వినిపిస్తుంది. తనే పొట్లూరి వరస్రసాద్ రావు. పివిపి బ్యానర్ తో తను నిర్మించబోతున్న సినిమాలు అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన పివిపి బ్యానర్ నుండి త్వరలో వరుసగా సినిమాలు రాబోతున్నాయి . కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘బెంగుళూరు డేస్’ రీమక్ రైట్స్ కూడా పివిపి వారు తీసుకున్నారు. దాంతో పాటు, మరో చిన్న సినిమాకి పివిపి బ్యానర్ శ్రీకారం చుట్టబోతోంది. ‘కర్మ’, ‘కిస్’, ‘పంజా’, ‘బలుపు’ సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయం ఉన్న అడవి శేష్ హీరోగా పివిపి వారు ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అలాగే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ రెండు భారీ ఫ్రాజెక్ట్స్ ని పివిపి బ్యానర్ స్టార్ట్ చేయబోతుంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ సుధీప్ తోనూ ఓ మూవీకి ప్లానింగ్స్ చేస్తుంది పివిపి బ్యానర్. తెలుగులో రెండు భారీ చిత్రాలని రూపొందించనుంది. అందులో పవన్ కళ్యాణ్ తో మూవీ ఒకటి ఉంది. గబ్బర్ సింగ్2 మూవీ తరువాత పవన్ కళ్యాణ్ నటించబోయే సన్సేషనల్ మూవీ పివిపి బ్యానర్ లో వచ్చేదే అంటూ టాలీవుఢ్ లో ఇప్పటికే టాపిక్స్ నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి గత ఎన్నికల సమయంలో ఆర్ధికంగా చాలా సహాయం చేశాడనే టాక్ కూడ పిపిపి మీద ఉంది. ఏదేమైనా తను మాత్రం పవన్ కళ్యాణ్ మూవీని తీయటానికి, అందులోనూ భారీ బడ్జెట్ గా మూవీగా తెరకెక్కించటానికి నిర్మాత సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమాల ప్రాజెక్ట్స్ వాల్యూ చూస్తే దాదాపు 150 కోట్ల రూపాయలకి చేరుకుంది. పివిపి వారు ఒక్కసారిగా ఇన్ని మూవీ కేవలం రెండు సంవత్సరాల సమయంలోనే తెరకెక్కించనున్నారు. దీంతో పివిపి సంస్థ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ లా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: