బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కి సెట్స్ పై అవమానం జరిగింది. బాలీవుడ్ యూత్ ఐకాన్ శ్రద్ధా కపూర్ కి ఈ అవమానం జరిగినట్టుగా బిటౌన్ లో కథనాలు వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ హష్మి, కంగనా రనౌట్ కాంబినేసన్ లో వస్తున్న అంగ్లి మూవీ షూటింగ్ లో శ్రద్ధా కపూర్ కి అవమానం జరిగినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ అంగ్లి మూవీలో శ్రద్ధా కపూర్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిచంనుంది. తాజాగా ఈ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశారు. అయితే సాంగ్ షూటింగ్ లో పాల్గొన్న శ్రద్ధాకపూర్, తన డ్రెస్సింగ్ ని బాగా టైట్ గా వేసుకుంది. దీంతో తను డ్యాన్స్ చేసేటప్పుడు అది చాలా ఇబ్బందిగా ఉందట. అందుకే తను కాష్ట్యూమ్స్ ని ఛేంజ్ చేసుకుంటానని తన డిజైనర్ కి ఆ విషయం చెప్పటంతో తను మరో కాష్ట్యూమ్స్ ని రెడీ చేస్తుంది. అయితే అయిప్పటికే రెండు గంటల సమయం పట్టింది. కొరియోగ్రాఫర్ అంత వరకూ ఓపిక పట్టలేక శ్రద్ధాకపూర్ ని సెట్స్ పైకి పిలిచి క్లాస్ పీకి, అలాగే ఇష్టమొచ్చినట్టుగా బూతు పదజాలాన్ని ఉపయోగించాడట. దీంతో సెట్స్ లో ఒక్కసారిగా ఏం జరుగుతుంతో అర్ధం అయ్యే సరికి అక్కడ నుండి శ్రద్ధా కపూర్ వెళ్ళిపోయింది. తరువాత నిర్మాత ఈ విషయాన్ని తెలుసుకొని కొరియోగ్రాఫర్ కి క్లాసు పీకటమే కాక, తనని మార్చి మరో కొరియోగ్రాఫర్ చేత ఆ మిగతా సాంగ్ షూటింగ్ ని పూర్తి చేయించారు. అలాగే శ్రద్ధా కపూర్ కి క్షమాపణలు కూడ చెప్పించాడట. ఈ విషయం లేటుగా వెలుగులోకి రావటంతో హాట్ టాపిక్ గా బిటౌన్ లో వినిపిస్తుంది. దీనికి సంబంధించిన కథనాన్ని బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన లీడింగ్ ఛానల్ బయటపెట్టడంతో అందరికి తెలిసింది. ఏదో స్పెషల్ ఎప్పీరియన్స్ ఇద్దామనకుంటే, తనకే ఎందుకు ఇలా జరిగిందని శ్రద్ధా కపూర్ తెగ బాధపడిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: