సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంటున్న సమంత గ్లామర్ రహస్యం బయటపడిందంటూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ హాట్ న్యూస్ బయటకు వినిపిస్తుంది. సహజంగా ఫిల్మ్ సెలబ్రిటీలకి కొద్ది మోతాదులో డ్రింక్ తీసుకునే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్స్, లీడింగ్ యాక్టర్స్ అంతా ఇలా చేస్తుంటారు. ఇదంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగినే కామన్ థింగ్. అయితే సమంత గత కొద్ది కాలంగా చూస్తుంటే తన ఫేస్ లోని గ్లో మరింతగా పెరుగుతూ వస్తుంది. తాజాగా అల్లుడు శీను మూవీలో అయితే సమంత వెరీ గ్లామరస్ గా కనిపిస్తుంది. అలాగే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూర్య సరసన నటించిన అంజాన్ మూవీలోనూ సమంత వెరీ గ్లామరస్ గా కనిపంచటమే కాకుండా సెక్సీ లుక్స్ తోనూ సూపర్భ్ అనిపించింది. అయితే దీనంతటికి కారణం సమంత ప్రతి రోజు కొద్దిగా డ్రింక్ చేస్తుందని కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తను తాగుతున్న బ్రాండ్ బాటిల్స్ ని సైతం బయటకు చెబుతున్నారు. దీంతో సమంత ఒక్కసారిగా షాక్ అయింది. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్న కుట్ర అని అంటుంది. రీసెంట్ గా తను అంజాన్ మూవీకి సంబంధించిన ఆడియో ప్రమోషన్స్ లో పాల్గొనలేదని ఎవరో ఈ విధంగా చేస్తున్నారని అంటుంది. ఎందుకంటే తను ప్రతి రోజు డ్రింక్ తీసుకుంటున్న అనే విషయం తనకి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కాని నేను ఎటువంటి అలవాట్లకి అలవాటు పడకుండానే, తనపై ఈ విధమైన వార్తలను క్రియోట్ చేయటం కేవలం తన స్టార్ డం ని దెబ్బతీయాలనే ఎవరో కావాలని చేస్తున్న పనిగా తనకి అనిపిస్తుంది. గతంలోనూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమంతపై హాట్ గాసిప్ వస్తే, అప్పుడు సమంత దాన్ని ఖండించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: