సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా మీడియాకు హాట్ టాపిక్. అతి తక్కువ బడ్జెట్ తో సినిమాను ఎలా తీయవచ్చో వర్మ ‘ఐస్ క్రీమ్’ తీసి జనానికి చూపెట్టాడు. అంతేకాదు సహకార పద్ధతిలో సినిమాలను ఏవిధంగా తీయవచ్చో యూట్యూబ్ లో పాఠాలను చెప్పాడు. ఇప్పుడు ఇవవ్వీ చాలక ‘ఫిల్మ్ ఆక్షన్ డాట్ ఇన్’ అనే వెబ్ సైట్ ను వర్మ ప్రారంభించాడు. ఈ వినూత్న పద్ధతిని వర్మ నిన్న సాయంత్రం మంచు వారి అబ్బాయి విష్ణుతో కలిసి ప్రకటించాడు. ఈ పద్ధతి ప్రకారం వర్మ నడిపే ఈ సైట్ లో ఇరు రాష్ట్రాలలోని సినిమా హాల్స్ కు సంబంధించిన వివరాలు ఉండటమే కాకుండా ఫలానా రేటుకు ఫలానా ఊరిలో ఫలానా సినిమా కొనాలి అంటే ఎంత రేటుకు వస్తుందో ఆ వెబ్ సైట్ లో వివరాలు ఇస్తారు. ఈ పద్ధతిలో ఓకే సినిమాకు ఒకే ధియేటర్ కు సంబంధించి పోటీ ఏర్పడితే వేలం పాట నిర్వహించి ఆ ధియేటర్ కు సంబంధించినంత వరకు సినిమా రైట్స్ అమ్ముతాడట వర్మ. ఇప్పటికే ఇరు రాష్ట్రాలలోను దాదాపు ౩౦౦ సినిమా హాల్స్ తో ఈ ఒప్పందాలు చేసుకున్నాను అంటున్నాడు వర్మ. దీనివల్ల నలుగురు స్టూడెంట్స్ కలిసి కూడ ఒక సినిమాను ఒక ఊరికి సంబంధించి కొనుక్కోవచ్చు అంటున్నాడు వర్మ. ప్రస్తుతం సినిమా ధియేటర్లు అన్నీ కొంతమంది బడా వ్యక్తుల ఆధీనంలో ఉండటంతో ఆ పద్ధతికి చెక్ పెట్టి చిన్న సినిమాలను బ్రతికించడానికి ఈ నూతన పద్ధతి ప్రారంభిస్తున్నాను అని వర్మ చెపుతున్నాడు.  మంచు విష్ణును భాగస్వామిగా చేసుకుని వర్మ ప్రారంభించిన ఈ సినిమాల వేలం పాట విజయవంతం అయితే టాలీవుడ్ పంపిణీ రంగంలో పెను మార్పులు వస్తాయి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: