టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అప్ కమింగ్ హీరోయిన్ కి సంబంధించిన ఎఫైర్ మేటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. “ఉయ్యాల జంపాల” సినిమాతో “చిన్నారి పెళ్ళికూతురు” సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న అవికాగోర్ టాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చింది. ఆ మూవీ అనంతరం అవికాగోర్ కి భారీగానే ఆఫర్స్ వస్తున్నాయి.అందం ,అభినయం తో తన మొదటి సినిమాతోనే అవికా మంచి పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే అవికాగోర్ తో పరిచయాల్ని పెంచుకోవటానికి టాలీవుడ్ కి చెందిన చాలా మంది హీరోలు తెగ ఉత్సాహాన్ని చూపుతున్నారు. అయితే ఉయ్యాల జంపాల మూవీ అనంతరం అవికాగోర్ దాదాపు ఇరవై సినిమా కథలు విన్నా కూడా, ఒక్కటి కూడా ఆమెకి నచ్చలేదట. చివరకి “లక్ష్మీ రావే మా ఇంటికి’ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసింది. లక్ష్మీ రావే మా ఇంటికి కథతో పాటు ఆ టైటిల్ కూడ తనకి బాగా నచ్చిందట. వైజాగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ కుటుంబ ప్రేమకథ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడు. రచయిత నంద్యాల రవి దర్శకునిగా పరిచయమవుతున్నారు. గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ కి చెందిన ప్రముఖ యంగ్ హీరో అవికాగోర్ తో డేటింగ్ చేస్తున్నట్టుగా టాక్స్ బయటకు వస్తున్నాయి. అవికాగోర్ కూడ ఆ యంగ్ హీరోతో చాలా క్లోజ్ రిలేషన్ ని నడుపుతుందని అంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యవహారం ఇప్పుడు బయట పడటంతో అవికాగోర్ ఏమి తెలియనట్టు ఉంటుంది. ఫిల్మ్ కెరీర్ స్టార్టింగ్ లోనే ఈ తరహా గాసిప్స్ ని పైకి రాకుండా చూసుకోవాలని అనుకుంటుంది. అందుకే ఆ యంగ్ హీరోతో దీనికి సంబంధించిన విషయాన్ని ఎక్కడా చెప్పకూడదని మాట తీసుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: