మంచు విష్ణు నిర్మించిన ‘దేనికైనా రెడీ’ సినిమాలో మంచు విష్ణు నటించిన బ్రాహ్మణ పాత్రలోని డైలాగ్స్ పై వివాదాలు రేగి రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలు అన్నీ మంచు విష్ణు పైనా, బ్రహ్మానందo పైనా ఘెరావ్ చేయడమే కాకుండా కొంతమంది మరొక అడుగు ముందుకు వేసి మంచు విష్ణుకు పిండాలు కూడ పెట్టారు. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళడంతో ఈ సినిమా నిర్మాత మోహన్ బాబు కూడ కోర్టుకు సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి బ్రహ్మనందానికి మరోసారి రాబోతోంది అనే వార్తలు వినపడుతున్నాయి. దీనికి కారణం ఈ ఆగష్టు 15నున విడుదల కాబోతున్న సూర్యా ‘సికిందర్’ సినిమా అని అంటున్నారు. ఈ సినిమాలో బ్రహ్మీ గురు శాస్త్రిగా వేయబోయే పంచ్ లు ప్రేక్షకులకు మంచి కామెడీని పండించినా ఈ పంచ్ డైలాగ్స్ మళ్ళీ బ్రాహ్మణుల మనో భావాలను దెబ్బ తీస్తాయా? అనే భయం ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లకు ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గురు శాస్త్రి పాత్ర ద్వారా బ్రహ్మనందం తనపై తాను సెటైర్లు వేసుకుంటాడు కాని ఏ కులం పై వారి మనో భావాలు దెబ్బ తీసే విధంగా ఈ సినిమాలోని బ్రహ్మి గురు శాస్త్రి పంచ్ డైలాగ్స్ ఉండవని ఈ సినిమా నిర్మాతలు అంటున్నారు. కానీ ఫిలింనగర్ గాసిప్ రాయుళ్ళు మాత్రం ఈ సినిమా ద్వారా బ్రహ్మి మరోసారి వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: