క్యూట్ హీరోయిన్ సమంత ఏమిచేసినా సంచలనేమే ! ఈ మాయలేడికి చెందిన టీంలోని చిత్తూరు రవిని అమాంతం ఎత్తు కున్న ఫోటో ఒకటి ఇప్పుడు వెబ్ మీడియాలో హడావిడి చేస్తోంది. మిర్చి సినిమాలో అనుష్క ప్రభాస్‌ను ఎత్తుకున్నట్లు ఇక్కడ రవిని అమాంతం ఎత్తు కుని ఫోటోలకు పోజ్ ఇచ్చింది. అయితే సమంతకు అంత ఆనందాన్ని కలిగించే పని ఇతడు ఏమి చేసాడో ఒక్క సమంతకే తెలియాలి.  తాను హాట్ సీన్స్ లో నటిoచడమే కాదు తన మనసుకు నచ్చితే ఎవరినైనా ఇలా ఆడ ‘బహుబలి’ లా అమాంతం ఎత్తుకుని మోయగలనని టాప్ టాప్ హీరోలకు సవాల్ విసురుతోందిఈ క్యూట్ బ్యూటి. హీరోలతోనే కాకుండా తానూ అందరితో ఇలా జోష్ గా ఉంటానని చెప్పడానికే సమంత ఈ పోజ్ ఇచ్చింది అని అనుకోవాలి.  ఇక ఇది ఇలా ఉండగా రాబోతున్న ఆగష్టు 15వ తారీఖు సమంత కెరియర్ కు సంభందించి చాల ముఖ్య మైన రోజుగా చెప్పుకోవాలి. ఆ రోజు విడుదల అవుతున్న ‘’రభస”, ‘సికిందర్’ లాంటి రెండు భారీ చిత్రాలలో సమంత హీరోయిన్ గా నటిస్తూ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లలో సమంత తన రేంజ్ ఏమిటో మిగతా హీరోయిన్స్ కు రుచి చూపించ బోతోంది.  ఇప్పటికే తన ట్విటర్ ద్వారా హీరోల పై సెటైర్లు వేసే సమంత ఇలా ‘బాహుబలి’ లా మారిపోతే హీరోలకు రానున్నది కష్టకాలమే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: