ఈరోజు ఉదయం 7 గంటలకు పూరి జగన్నాధ్ కొత్త ఇల్లు కేవ్ లో జూనియర్ పూరీల కొత్త సినిమా ప్రారంభోత్సవంతో మొదలవుతున్న ఈరోజు ఎన్టీఆర్ కు చాల బిజీ డేగానే కాకుండా ముఖ్యమైన రోజుగా మారుతోంది. ఈ రోజు ఉదయం తన కొత్త సినిమాకు పూజ కార్య క్రమాలు పూర్తి అయ్యాక సాయంత్రం జరగబోయే 'రభస' ఆడియో వేడుకలో తాను తన అభిమానులముందు పాడబోయే 'రాకాసి రాకాసి' పాటకు తన గొంతును సవరించు కోవడమే కాకుండా తన అభిమానులకు ఆనందం కలుగ చేసే విధంగా రెండు స్టెప్స్ కుడా వేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఈరోజు జూనియర్ తన చిన్న బుడ్డోడి ఫోటో మీడియాకు విడుదల చేస్తాడు అనే వార్తలు కుడా గట్టిగా వినిపిస్తున్నాయి గత సంవత్సరకాలంగా విజయాలకు దూరంగా సక్సస్ కోసం తపిస్తున్న జూనియర్ 'రభస' పై చాలా ఆసలే పెట్టుకున్నాడు. తనకు కొడుకు పుట్టిన తరువాత మొదటి సారి నేడు మీడియా ముందుకు రాబోతున్న జూనియర్ ఎటువంటి జోష్ లో ఉంటాడు అనే ఆశక్తి అందరిలోనూ ఉంది. ఒక వైపు లీక్ ల రభస మధ్య నేడు విడుదల అవుతున్న రభస పాటల ఫలితం ఈరాత్రికి తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: