ఒక సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు మంచి జోష్ మీద ఉంటాడు. అయితే ‘రభస’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ‘రభస’ ఆడియో ఫంక్షన్ వేదిక పై అందరూ చూస్తుండగానే భావోద్వేగానికి లోనై కంట నీరు పెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ సినిమాకు సంబంధించిన కధ చెప్పిన వెంటనే ఓకె అన్న జూనియర్ అభిమానానికి కృతజ్ఞతగా జూనియర్ ఇమేజ్ కు తగ్గ స్థాయిలో ఈ సినిమాను మొదలుపెట్టాక తనకు అనారోగ్యం చేసి మూడు నెలలు షూటింగ్ ఆపేస్తే ఆ సమయంలో జూనియర్ తనకు అందించిన మానసిక ధైర్యం తనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా తన కంట కన్నీళ్ళు వస్తాయని సంతోష్ శ్రీనివాస్ అన్నాడు. అంతేకాదు జూనియర్ లాంటి స్థాయి ఉన్న ఒక టాప్ హీరో ఒక దర్శకుడి కోసం మూడు నెలలు ఆగరని అంటూ అటువంటి పరిస్థితి ఏర్పడితే మరో దర్శకుడి చేత సినిమాను షూట్ చేయిస్తారని అంటూ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు సంతోష్ శ్రీనివాస్. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రశంసలన్నీ జూనియర్ కే చెందుతాయని చెపుతూ వణుకుతున్న తన గొంతుతో భావోద్వేగానికి గురైన సంతోష్ శ్రీనివాస్ ను ఓదార్చడం ఎన్టీఆర్ వంతయింది.  ఈ సంఘటను ‘రభస’ ఆడియో వేడుకలో చూసిన అతిధులంతా జూనియర్ మంచితనాన్ని పోగాడటమే కాకుండా సంతోష్ శ్రీనివాస్ పడ్డ కష్టానికి ఈ సినిమా సక్సస్ ద్వారా ఫలితం వస్తుంది అంటూ అభినందించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: