అల్లరి నరేష్ పెళ్ళి పీటలు ఎక్కబోయే సమయానికి కౌంట్ డౌన్ మొదలు అయింది అంటూ ఫిలింనగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. వినిపిస్తున్న వార్తల ప్రకారం మన సుడిగాడు త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు టాక్. ప్రస్తుతం అల్లరి నరేష్ తల్లి మన లడ్డూబాఒక జోడిని వెదికే పనిలో చాల బిజీగా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.  టాలీవుడ్ యంగ్ హీరోగా ఇప్పటికే సెటిల్ అయిపోయిన అల్లరి నరేష్ కు పెళ్ళి కూతురు దొరకడం సమస్య కాకపోయినా నరేష్ పొడుగుకు సరిజోడి అయిన అమ్మాయి దొరకడం కష్టంగా ఉంది అంటూ గాసిప్స్ వినపడుతున్నాయి. అంతేకాదు ఈ పొడుగు విషయమే అల్లరోడికి తగ్గ అమ్మాయి దొరకడంలో ఆలస్యానికి కారణం అని అంటున్నారు. అయితే తన తల్లి కోసం అరేంజ్డ్ మ్యారేజ్ ప్రోపోజల్ కు ఒప్పుకున్నా నరేష్ ఏకంగా తన తల్లికే ఒక కండిషన్ పెట్టాడని టాక్. తన తల్లి ఎంపిక చేసే అమ్మాయిని ఒప్పుకునే ముందు తాను ఆ అమ్మాయితో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటానని ఒక కండిషన్ తన తల్లికి నరేష్ చెప్పాడు అనే వార్తలు కూడ ఉన్నాయి.  ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియవు కాని ఈ సంవత్సరంలోపు అల్లరోడికి పెళ్ళి బాజాలు మోగడం ఖాయం అని అంటున్నారు. నరేష్ సినిమాలకు హీరోయిన్స్ కొరత అయితే నిజజీవితంలో కూడ నరేష్ కు అదే సమస్య ఎదురౌతోంది అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: