ఒకొక్కసారి ఫిలింనగర్ లో హాట్ న్యూస్ లను ఎవరు సృష్టిస్తారో తెలియకపోయినా వినిపించే ఆ వార్తలు టాప్ హీరోల అభిమానులను ఖంగారు పెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి జూనియర్ నటించిన ‘రభస’ సినిమాకు ఏర్పడింది. ప్రస్తుతం ఫస్ట్ కాపీ రెడీ చేసుకోవడంలో బిజీగా ఉన్న ‘రభస’ యూనిట్ సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఈనెల 21న స్లాట్ బుక్ చేసుకుంది అనే వార్తలు వస్తున్నాయి.  నిన్న జరిగిన తెలంగాణా సర్వే వల్ల సినిమా పరిశ్రమ అంతా పూర్తి సెలవు పాటించడం వల్ల చివరి నిముషంలో పనులన్నీ పూర్తి చేసుకుని ‘రభస’ 21వ తేదీకి అందుకోగలుగు తుందా అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గతంలో బెల్లం కొండ సురేష్ నిర్మించిన సినిమాలు అన్నింటికి సెన్సార్ సమస్యలు వచ్చాయని ‘అల్లుడు శీను’ విషయంలో కూడ సెన్సార్ అనేక సమస్యలు బెల్లంకొండకు క్రియేట్ చేసిందని కొంతమంది టాక్. ఆ సాంప్రదాయం బట్టి ‘రభస’ కు కూడ అనుకోని సెన్సార్ సమస్యలు వస్తే ఆఖరి నిముషంలో ఈ సినిమా పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదని కొంతమంది గాసిప్ రాయుళ్ళు రూమర్లు పుట్టిస్తున్నారు. అయితే వస్తున్న ఈ రూమర్లను వింటున్న జూనియర్ అభిమానులు మాత్రం ఈనెల 29 వినాయకచవితి కూడ మిస్ అయితే ‘రభస’ పరిస్థితి ఏమిటి అనే టెన్షన్ పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏమైనా మరో రెండు, మూడు రోజులలో ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: